ఉత్తర్ప్రదేశ్ శ్రావస్తిలో భారీ వర్షం వల్ల ఓ పెళ్లి బృందం తీవ్రం ఇబ్బందులు పడింది. వరుడి తరపు బంధువులు పెళ్లికుమారుడితో కలిసి.. ధోబియాన్ పూర్వ గ్రామం వధువు ఇంటికి వెళ్లారు. గ్రామంలో అడుగుపెట్టారో.. లేదో.. వెంటనే భారీ వర్షం మొదలైంది. ఎలాగోలా వర్షంలోనే పెళ్లి జరిపించారు.
వాన నిలిచాక తిరిగి వెళుతుండగా హతియకుందా గ్రామం వద్దకు చేరుకోగానే మళ్లీ వర్షం మొదలైంది. ఆ ఊరిని దాటాలంటే కాలువ దాటాలి. కానీ కాలువ పొంగిపొర్లుతోంది. సమాచారం తెలుసుకున్న గ్రామసర్పంచ్ స్థానికుల సాయంతో వారిని కాలువ దాటించారు. ఈ క్రమంలో కొందరు పెళ్లివారు ఈదుకుంటూ కాలువ దాటిన పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండి: భారీ అలలు.. అంతా చూస్తుండగానే మునిగిన పడవ