The Elefant Toys Library In Mumbai : లైబ్రరీ అంటే పుస్తకాలు ఉంటాయి. ఇలా చాలా మంది తమకు నచ్చిన బుక్స్ కోసం వెళ్తుంటారు. అలానే పిల్లలకు కావాల్సిన బొమ్మల కోసం కూడా ఓ లైబ్రరీ ఉంది. అదే 'ది ఎలిఫెంట్ టాయ్స్ లైబ్రరీ'. దీనిని ముందుగా తన కుమార్తె కోసం ప్రారంభించాడు ఓ తండ్రి. ఈ లైబ్రరీలో తన కూతురుకు కావాల్సిన వివిధ రకాల బొమ్మలను పెట్టాడు. తర్వాత తన కూతురుతో పాటు మిగతా పిల్లలు కూడా ఈ బొమ్మలను అందిస్తున్నాడు. అతడే ముంబయిలోని మాలాడ్ ప్రాంతానికి చెందిన సౌరభ్ జైన్..
తన కూతురు ఇష్టపడిన బొమ్మలు దొరక్కపోవటం వల్ల కలత చెందిన సౌరభ్.. స్వయంగా కుమార్తె కోసం వివిధ రకాల బొమ్మలను తయారు చేయటం ప్రారంభించాడు. అలా బొమ్మల కోసం ఏర్పాటు చేసిన లైబ్రరీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా 14 నగరాలకు విస్తరించింది. తన కుమార్తె లాగానే మిగతా పిల్లలకు కూడా వాళ్లకి కావాల్సిన బొమ్మలను.. పొందటం కోసం ఒక మొబైల్ యాప్‌ను ప్రారంభించాడు. దాని సాయంతో పిల్లల ఇంటికి తక్కువ ధరలకే ఉచితంగా డెలివరీ చేస్తున్నాడు.
" పిల్లలను కచ్చితంగా బొమ్మలతో ఆడుకోనివ్వాలి. మా లైబ్రరీ నుంచి మీరు ఎప్పుడైనా బొమ్మలను తీసుకోవచ్చు. మా దగ్గరున్న ప్రతి వస్తువును శానిటైజ్ చేస్తాము. దీని వల్ల మీరు మీ పిల్లలను రోజుకో కొత్త బొమ్మలతో ఆడుకోనివ్వచ్చు."
--సౌరభ్, ది ఎలిఫెంట్ టాయ్స్ యాజమాని
ఈ బొమ్మల కోసం 'ది ఎలిఫెంట్ టాయ్స్' అనే యాప్‌లో ఇంటి అడ్రాస్లను ఇస్తే చాలు మనుకు బొమ్మలను ఉచితంగా హోమ్ డెలవరీ చేస్తారు. బొమ్మలను కొనడం కోసం సబ్స్క్రిప్షన్ ఉంటాయి. అతి తక్కువ ధరలకే బొమ్మలను పిల్లలకు అందిస్తున్నమని సౌరభ్ తెలిపాడు. విరిగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుని బొమ్మలను డెలవరీ చేస్తున్నమని సౌరభ్ తెలిపాడు.'ది ఎలిఫెంట్ టాయ్స్ లెబ్రరీ'కి తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తమ పిల్లలు సంతోషంగా బొమ్మలతో ఆడుకుంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు.
" ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతి. దీనివల్ల చిన్నారుల స్క్రీన్ టైమ్ కూడా తక్కువైంది. వాళ్లు ఇంట్లో చక్కగా ఆడుకుంటున్నారు. నేను కూడా పిల్లలతో సమయాన్ని గడుపగలుగుతున్నాను. బయట ఇలాంటి వస్తువులు అంతా ఈజీగా దొరకవు. వీళ్ల దగ్గర మంచి కలెక్షన్స్ ఉన్నాయి. మనం ఆర్డర్ పెట్టిన వెంటనే వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లలు తమంతట తామే ఈ ప్యాకేజ్‌ను ఓపెన్ చేస్తున్నారు. చాలా సేఫ్ ప్యాకేజింగ్ చేస్తారు." -రసేష్ ఠాకోర్
తన కూతురు కోసం మొదలుపెట్టిన ఈ 'ది ఎలిఫెంట్ టాయ్స్ లైబ్రరీ' నుంచి.. ఇప్పుడు చాలా మంది తమ పిల్లల కోసం బొమ్మలను తీసుకోవటం సంతోషంగా ఉందని తెలిపాడు సౌరభ్.
ఒకప్పుడు తాగుబోతుల అడ్డా.. ఇప్పుడు గ్రంథాలయం.. 'ట్రీ లైబ్రరీ'తో మారిన రూపురేఖలు