ETV Bharat / bharat

త్వరలో కొవాగ్జిన్ ఉత్పత్తి రెట్టింపు - కొవాగ్జిన్​ టీకా

current production capacity of Covaxin vaccine will be doubled
కొవాగ్జిన్ ఉత్పత్తి రెట్టింపు
author img

By

Published : May 12, 2021, 4:31 PM IST

Updated : May 12, 2021, 5:03 PM IST

16:26 May 12

త్వరలో కొవాగ్జిన్ ఉత్పత్తి రెట్టింపు

భారత్​ బయోటెక్​ తయారు చేస్తున్న కొవాగ్జిన్ టీకా ఉత్పత్తి.. మే-జూన్‌ నాటికి రెట్టింపు కానుందని కేంద్ర కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ తెలిపింది. జులై-ఆగస్టు నాటికి ఉత్పత్తి ఆరేడింతలు పెరుగుతుందని చెప్పింది. సెప్టెంబరు నాటికి నెలకు 10కోట్ల డోసులు ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకుంటుందని పేర్కొంది.

ఆత్మనిర్భర భారత్​ 3.0లో భాగంగా.. 'మిషన్​ కొవిడ్​ సురక్ష'ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా కొవిడ్​ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే దేశీయ సంస్థలకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపింది. ఇందులో భాగంగానే.. భారత్​ బయోటెక్​ సంస్థకు తమ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకుగాను నిధులు అందజేయనున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ తెలిపింది. ఇప్పటికే.. బెంగళూరులో 'కొవాగ్జిన్'​ ఉత్పత్తి కోసం ఆ సంస్థకు రూ.65 కోట్లను విడుదల చేసింది.

ఇదీ చూడండి: బ్లాక్​ ఫంగస్​పై కేంద్రం అప్రమత్తం- డ్రగ్​ ఉత్పత్తికి ఆదేశం

Last Updated : May 12, 2021, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.