ETV Bharat / bharat

శత్రువులకు ధీటుగా 'ఇంటిగ్రేటెడ్​ బ్యాటిల్ గ్రూప్స్'

సరిహద్దు దేశాల నుంచి ఎదురయ్యే సవాళ్లకు దీటుగా బదులిచ్చేందుకు ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్‌ రూపకల్పనకు నడుం బిగించిన సైన్యం.. ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. కొవిడ్ మహమ్మారి, చైనాతో ఘర్షణల కారణంగా ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్‌ రూపకల్పన పూర్తిచేయాలని సైన్యం భావిస్తోంది.

Integrated Battle Groups‌
ఇంటిగ్రేటెడ్​ బ్యాటిల్ గ్రూప్స్
author img

By

Published : Jun 7, 2021, 2:58 PM IST

సరిహద్దు దేశాల నుంచి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు సైన్యం సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్‌ ఏర్పాటు చేయటంపై దృష్టి సారించింది. విపత్కర పరిస్థితుల్లో ఉద్రిక్త ప్రాంతాలకు వేగంగా చేరుకోవటం సహా శత్రువులపై దాడి చేసి బలంగా దెబ్బకొట్టే సామర్థ్యం ఉండేలా ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్‌ గ్రూప్స్​ను తయారు చేయాలని భావిస్తోంది. కొవిడ్ మహమ్మారిసహా చైనాతో ఘర్షణాత్మక పరిస్థితుల కారణంగా ఈ ప్రక్రియకు కాస్త ఆలస్యం అయ్యింది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్‌ ఐబీజీలను తయారు చేయాలని సైన్యం ప్రణాళికలను రచిస్తోంది.

ఒక్కో గ్రూప్​లో 5 వేల మంది..

ఒక్కొక్క గ్రూప్‌లో సుమారు 5వేల మంది సైనికులు ఉండనున్నారు. పదాతి దళం, ట్యాంకులు, ఫిరంగులు, ఎయిర్‌ డిఫెన్స్, సిగ్నల్స్‌, ఇంజినీర్లు ఇతర యూనిట్లను కలిపి ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్‌గా వ్యవహరించనున్నారు. భవిష్యత్తులో ఏదైనా సమస్యలు తలెత్తితే అన్ని విభాగాలను కలుపుకొని ఏ విధంగా ఆపరేషన్‌ చేపట్టాలనే అంశమై తమ కార్యాచరణ ప్రక్రియలో ఐబీజీల రూపకల్పన వ్యూహాత్మక అడుగుగా ఆర్మీచీఫ్ జనరల్‌ ఎం.ఎం. నరవణె తెలిపారు. ఈ గ్రూప్​ల రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోందన్న ఆర్మీ చీఫ్.. భవిష్యత్తు యుద్ధాల్లో విజయాన్ని అందించేలా వీటిని తీర్చిదిద్దేందుకు అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్, థియేటర్ కమాండ్స్ రూపకల్పన సహా సైన్యంలో ప్రస్తుతం జరుగుతున్న వ్యవస్థాగత పునర్నిర్మాణం ద్వారా చైనా, పాకిస్థాన్‌ నుంచి ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా బదులివ్వవచ్చని చెబుతున్నారు. మారుతున్న యుద్ధవ్యూహాలు సైనిక వ్యవహారాల్లో విప్లవాత్మక మార్పులుసహా సరిహద్దు దేశాల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు చెబుతున్నారు.

భౌగోళికతకు తగ్గట్టు..

బ్రిగేడ్‌ల కంటే పెద్దగా, డివిజన్ల కంటే చిన్నగా ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూపులను ఏర్పాటు చేయనున్నారు. సాధారణంగా బ్రిగేడ్‌లో 3వేల మంది సైనికులు, డివిజన్‌లో 12వేల మంది సైనికులు ఉంటారు. తొలుత 8నుంచి 10ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూపులను తయారుచేసిన తర్వాత భవిష్యత్తులో మరిన్ని గ్రూపుల రూపకల్పన చేయాలని సైన్యం భావిస్తోంది. సరిహద్దుల్లో ఎదురయ్యే సవాళ్లు, అక్కడి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఈ ఇంటిగ్రేటెడ్​ బ్యాటిల్ గ్రూప్​ల రూపకల్పన చేయాలని సైన్యం యోచిస్తోంది. పాకిస్థాన్ సరిహద్దులవైపు మైదాన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ట్యాంకులు, భారీగా ఫిరంగులతో ఐబీజీలను ఏర్పాటు చేయాలని సైన్యం భావిస్తోంది. ఇదే సమయంలో పర్వత ప్రాంతాలున్న చైనా సరిహద్దుల వైపు ఎక్కువగా పదాతిదళం, ఫిరంగులతో కూడిన ఐబీజీలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

ఇదీ చదవండి:వైద్యులకు రక్షణ కల్పించాలని మోదీకి ఐఎంఏ లేఖ!

viral: రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.