మహారాష్ట్ర ఠాణె కౌసాలోని ప్రైమ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జితేంద్ర ఆహ్వాడ్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరగవచ్చని అనుమానిస్తున్నారు.
ఘటన సమయంలో ఆస్పత్రిలో మొత్తం 17 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వారిని వేరే చోటుకు తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు జితేంద్ర తెలిపారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీతో దర్యాప్తు చేయిస్తామని చెప్పారు.