ETV Bharat / bharat

'జమ్ముకశ్మీర్​కు ఇప్పటికీ ఉగ్రముప్పు'

ఉగ్రవాదుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ జమ్ముకశ్మీర్​కు ఉగ్ర ముప్పు తొలగిపోలేదని భారత సైన్యం అభిప్రాయపడింది. ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న విదేశీ రాయబారులకు అక్కడి పరిస్థితిని వివరించారు లెఫ్టినెంట్ జనరల్ బి. ఎస్. రాజు. ఈ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు.

Terrorists still retain ability of attacks in J&K: Army
జమ్ము-కశ్మీర్​కు ఇప్పటికీ ఉగ్రముప్పు: సైన్యం
author img

By

Published : Feb 19, 2021, 6:14 AM IST

జమ్ముకశ్మీర్​కు ఉగ్రముప్పు ఇంగా పూర్తిగా తొలగిపోలేదని భారత సైన్యం తెలిపింది. ఇప్పటికీ దాడులకు తెగబడగల సత్తా అక్కడి ముష్కరులకు ఉందని అభిప్రాయపడింది. జమ్ముకశ్మీర్​ పర్యటనకు విచ్చేసిన 24 మంది విదేశీ దౌత్యవేత్తలతో కూడిన బృందానికి చినార్ కార్ఫ్స్​ ​ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ బి. ఎస్​. రాజు ఈ మేరకు గురువారం పలు వివరాలు నివేదించారు. ఉగ్రవాదుల సంఖ్యను 200లకు పరిమితం చేసినట్లు ఆయన చెప్పారు. అయినప్పటికీ ప్రజల భద్రత కోసం మరింత మంది బలగాలను మోహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

సరిహద్దుల్లో నిఘా కార్యకలాపాలను విస్తృతం చేయడం వల్ల పాకిస్థాన్​ నుంచి భారత్​లోకి ప్రవేశించడం ముష్కరులకు కష్టంగా మారిందని బి. ఎస్ రాజు తెలిపారు. అందుకే ఉగ్రవాద ముఠాలు, పాక్ సంస్థలు నియంత్రణ రేఖ (ఎల్​ఓసీ), అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి సొరంగాలను తవ్వి భారత్​లోకి ముష్కరులను పంపించేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. చొరబాట్లకు పాక్ సైన్యం అందిస్తున్న సహకారంపై దౌత్యవేత్తలకు భారత్ సమగ్ర వివరాలు సమర్పించింది.

ఇదీ చూడండి: పాక్ ఉగ్ర చర్యలపై విదేశీ రాయబారుల ఆరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.