ETV Bharat / bharat

కశ్మీర్​లో మూడు ఉగ్ర దాడులు- ఇద్దరు మృతి - జమ్ముకశ్మీర్​

జమ్ముకశ్మీర్​లో ఒక్కరోజే మూడు చోట్ల ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఓ కీలక ఉగ్రవాది సహా.. ఓ యువకుడు మృతి చెందాడు. కశ్మీర్​ నేతలతో ప్రధాని మోదీ భేటీకి ఒక్కరోజు ముందు ఈ దాడులు జరగటం గమనార్హం. దాడుల నేపథ్యంలో 48 గంటల పాటు హైఅలర్ట్​ ప్రకటించారు.

Terrorist attack
కశ్మీర్​లో ఉగ్రదాడులు
author img

By

Published : Jun 24, 2021, 8:34 AM IST

జమ్ముకశ్మీర్​ రాజకీయ పార్టీల నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో.. దానికి ఒక్క రోజు ముందు మూడు చోట్ల ఉగ్రదాడులు జరగడం గమనార్హం. జమ్ముకశ్మీర్​లోని శోపియాన్​ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్​కౌంటర్​లో హిజ్బుల్​ ముజాహిదీన్​ సంస్థకు చెందిన సజద్​ అహ్మద్​ భట్​ అనే ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు తెలిపారు.

షిర్మల్​ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారన్న సమాచారంతో భద్రత దళాలు గాలింపు చేపట్టాయని, ఆ సమయంలో ముష్కరులు కాల్పులు ప్రారంభించారని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో సజద్​ మరణించినట్లు పేర్కొన్నారు. ఘటన స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

అదే రోజు పుల్వామాలోని రాజ్​పొర చౌక్​లో ఉన్న సీఆర్​పీఎఫ్​, పోలీసు దళాల గస్తీ బృందంపై ఉగ్రవాదులు గ్రెనేడ్​ విసిరారు. దీంతో భద్రత దళాలు గాల్లోకి కాల్పులు జరిపాయని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు చెప్పారు.

మరోవైపు శ్రీనగర్​లోని హబకడల్​ ప్రాంతంలో గుర్తు తెలియని సాయుధుడు ఓ యువకుణ్ని కాల్చి చంపాడు. ఈ పరిణామాల నేపథ్యంలో జమ్ముకశ్మీర్​లో 48 గంటల పాటు అప్రమత్తత ప్రకటించారు.

ఇదీ చూడండి: నేడు కశ్మీర్ నేతలతో మోదీ కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.