పంజాబ్‌లోని సంగూర్లో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. పెళ్లి వేడుకకు హాజరైన వారు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. వేగంగా వస్తున్న కారు ఆగి ఉన్న డీజిల్ ట్యాంక్‌ను ఢీకొట్టగా మంటలు చెలరేగాయి. కారులోని వారు బయటకు రావడానికి వీలు లేకుండా పోవడం వల్ల వారంతా అక్కడికక్కడే మృతి చెందారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతులు బంధువులకు సమాచారం అందించారు.