ETV Bharat / bharat

కొత్తగా కొలువుదీరనున్న కేబినెట్ - మంత్రులుగా ఛాన్స్​ వీరికేనా? - తెలంగాణలో కొత్త ప్రభుత్వం కేబినెట్

Telangana New Cabinet 2023 : రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరికి మంత్రులుగా అవకాశం కల్పిస్తారనే అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చ సాగుతోంది. పలువురు సీనియర్లతో పాటు కొత్తవారికి అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ కూర్పు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరి తెలంగాణలో కొత్తగా మంత్రి అయ్యే ఛాన్స్ ఎవరెవరికి ఉందో ఓసారి తెలుసుకుందామా?

New Government Cabinet in Telangana 2023
Telangana New Cabinet 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 7:09 AM IST

Updated : Dec 5, 2023, 7:14 AM IST

కొత్తగా కొలువుదీరనున్న కేబినెట్ - మంత్రులయ్యే ఛాన్స్ వీరికేనా?

Telangana New Cabinet 2023 : తెలంగాణ కొత్త ప్రభుత్వంలో మంత్రులెవరన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, త్వరలోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనుంది. సీఎం ఎంపికపై అధిష్ఠానం నుంచి ఇంకా నిర్ణయం రాకపోవడంతో 6 లేదా 9న ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పూర్తిస్థాయి మంత్రివర్గం ఒకేసారి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రితో కలిపి 18 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కాకుండా మరో 16 మందికి అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ కూర్పు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

New Cabinet in Telangana 2023 : ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే ప్రత్యేకించి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువమంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవంతో పాటు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు, గతంలో ఎంపీలుగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వారిని మంత్రి పదవులకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. తొలిసారి శాసనసభలోకి అడుగుపెట్టిన వారికి అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది.

రాజ్​భవన్​లో నూతన సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు - మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్

Telangana Congress Cabinet List 2023 : ఆదిలాబాద్‌ నుంచి వివేక్, ప్రేమసాగర్‌రావు, నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి శ్రీధర్‌బాబు, పొన్నంప్రభాకర్‌ పేర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. అలాగే జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డి ఓడిపోయినా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సీనియార్టీని పరిగణనలోకి తీసుకొని ఆయనకు అవకాశం ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. మైనార్టీ వర్గం నుంచి పోటీ చేసిన వారంతా ఓడిపోయారు. ఈ తరుణంలో షబ్బీర్‌ అలీని మంత్రివర్గంలోకి తీసుకొని మండలికి పంపుతారనే ప్రచారం సాగుతోంది.

Congress New Government in Telangana : మెదక్‌ జిల్లా నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా పేరు ఖరారైనట్లుగా వినిపిస్తోంది. ఆ జిల్లా నుంచి మరొకరికి అవకాశం తక్కువే. మహబూబ్‌నగర్‌ నుంచి రేవంత్‌ రెడ్డి మినహాయిస్తే జూపల్లి కృష్ణారావు, వంశీకృష్ణ పేర్లతో పాటు షాద్‌నగర్‌ నుంచి గెలుపొందిన శంకర్‌ను పరిశీలించవచ్చని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో గడ్డం ప్రసాద్, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి నుంచి ఎంపిక చేసే వీలుంది. నల్గొండ జిల్లాలో సీనియర్‌ నాయకులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఉన్నారు.

ఉత్తమ్‌ ఆసక్తి చూపకపోతే ఆయన భార్య పద్మావతికి అవకాశం ఇవ్వవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరంగల్‌ నుంచి సీతక్క, కొండా సురేఖ ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. స్పీకర్‌ ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లాలో ఉన్న పోటీని పరిగణనలోకి తీసుకొని తుమ్మల పేరును స్పీకర్‌ స్థానానికి పరిశీలించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

సీఎం అభ్యర్థి ప్రకటనపై వీడని ఉత్కంఠ - మరింత ఆలస్యమయ్యే అవకాశం!

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటు - గెజిట్ నోటిఫికేషన్ జారీ

Last Updated : Dec 5, 2023, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.