ETV Bharat / bharat

Secretariat: కొత్త సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన సీఎం, మంత్రులు.. ఆ దస్త్రాలపై తొలి సంతకం - హైదరాబాద్ తాజా వార్తలు

CM KCR and Ministers First Sign on Important Files: రాజధాని నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఠీవీగా రాజసం ప్రదర్శిస్తున్న సమీకృత సచివాలయ భవనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మొదట సీఎం కేసీఆర్ తన ఛాంబర్​లో ఆసీనులై.. కీలకమైన 6 ఫైళ్లపై సంతకాలు చేశారు. అలాగే రాష్ట్ర మంత్రులందరూ కూడా తమ ఛాంబర్లలో బాధ్యతల స్వీకరణ అనంతరం పలు దస్త్రాలపై మొదటి సంతకం చేశారు.

CM KCR
CM KCR
author img

By

Published : Apr 30, 2023, 5:27 PM IST

CM KCR and Ministers First Sign on Important Files: తెలంగాణలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆత్మగౌరవ ప్రతీకగా సంప్రదాయం, ఆధునికత, సాంకేతికత మేళవింపుగా నిర్మించిన... డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం 6వ అంతస్తులో పూజాకార్యక్రమాల్లో పాల్గొని... సీఎం ఛాంబర్‌లో కేసీఆర్ ఆసీనులయ్యారు. నిర్ణీత ముహూర్తం... ఒంటిగంట 20నిమిషాల నుంచి ఒంటిగంటా 32 నిమిషాల మధ్య ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ దస్త్రంపై తొలి సంతకం చేయగా... మెుత్తం 6 ఫైళ్లపై సంతకాలు సీఎం చేశారు.

కీలక దస్త్రంపై కేటీఆర్ సంతకం: సచివాలయంలోని ఛాంబర్​లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పూజలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఛాంబర్‌కి వెళ్లి సీఎస్​కి అభినందనలు తెలిపారు. సుముహూర్త సమయంలో దస్త్రంపై సీఎస్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తమ ఛాంబర్లలో ఆశీనులై తొలి దస్త్రాలపై సంతకాలు చేశారు. హైదరాబాద్​లో లక్ష రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ మార్గదర్శకాల దస్త్రంపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంతకం చేశారు.

రెండు దస్త్రాలపై సంతకాలు చేసిన మంత్రి హరీశ్‌రావు: ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు రెండు దస్త్రాలపై సంతకాలు చేశారు. టీచింగ్ ఆసుపత్రుల్లో 18వందల 27 స్టాఫ్ నర్స్‌ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ దస్త్రాలు.. ఇటీవల అకాల వర్షాలతో పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు పంట సాయం కింద రూ.151. 64 కోట్ల నిధుల విడుదల ఫైల్​పై హరీశ్ సంతకాలు చేశారు. సచివాలయంలోని మొదటి అంతస్తులో మూడు కమిషనరేట్ల జోన్ల పునర్​వ్యవస్థీకరణ, పోస్టుల మంజూరు దస్త్రంపై హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సంతకం చేశారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్​కి బంధించిన మే నెల బాకాయిలు 958 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మంత్రి జగదీశ్‌రెడ్డి... అంగన్‌వాడీలకు సన్నబియ్యం పంపిణీ, రాంజీగోండ్ మ్యూజీయానికి 10 కోట్లు మంజూరుచేస్తూ దస్త్రంపై మంత్రి సత్యవతి రాఠోడ్ సంతకాలు చేశారు.

ఆ శాఖ పునర్ వ్యస్థీకరణ దస్త్రంపై ప్రశాంత్ రెడ్డి సంతకం: ఆర్ అండ్ బీ శాఖ పునర్ వ్యస్థీకరణ దస్త్రంపై సచివాలయంలోని ఐదో అంతస్తులో మంత్రి ప్రశాంత్ రెడ్డి సంతకం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖకు 472 పోస్ట్​లు మంజూరు చేయడం ద్వారా ఆర్ అండ్ బీ శాఖ పునర్వ్యవస్థీకరణ చేపట్టి.. మూడు చీఫ్ ఇంజినీర్ కార్యాలయాలు, 10 సర్కిల్స్, 13 డివిజన్లు, 79 సబ్-డివిజన్లు, 124 సెక్షన్లను కొత్తగా ఏర్పాటు చేసుకున్నామని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్​లో పూజా కార్యక్రమాల అనంతరం కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా 'మే డే' ఫైల్​పై మొదటి సంతకం చేశారు. అలాగే శ్రమ శక్తి అవార్డుల దస్త్రంపై మల్లారెడ్డి సంతకం చేశారు.

ముఖ్య దస్త్రాలపై సంతకాలు చేసిన మంత్రులు: రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించిన దస్త్రంపై నాలుగో అంతస్తులో ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా సీఎం కప్ నిర్వహణకు 3 కోట్ల 20 లక్షల రూపాయలను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల హబ్​గా రూపుదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. మండల కేంద్రాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో వినియోగదారుల సేవా కేంద్రాల ఏర్పాటు దస్త్రంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సంతకం చేశారు. 25 శాతం రాయతీ, 75 శాతం స్త్రీనిధి రుణంతో 25 లక్షల వ్యయంతో వినియోగదారుల సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, వ్యవసాయ ఉపకరణాల సేవల కోసం 125 కోట్ల వ్యయంతో 500 మండలాల్లో సేవా కేంద్రాలు ఏర్పాటు కానున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.