ETV Bharat / bharat

Avinash Bail Petition: అవినాష్ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా - ఏపీ తాజా వార్తలు

HIGH COURT ON MP AVINASH ANTICIPATORY BAIL PETITION: వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్​ ఇవ్వాలని అవినాష్​ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో.. ఈ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో అవినాష్​ను మంగళవారం సాయంత్రం విచారించాలని హైకోర్టు సూచించగా.. సీబీఐ అందుకు అంగీకరించింది.

mp avinash in high court
mp avinash in high court
author img

By

Published : Apr 17, 2023, 6:58 PM IST

HIGH COURT ON MP AVINASH ANTICIPATORY BAIL PETITION: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేడు సీబీఐ విచారణకు ముందు తెలంగాణ కోర్టును అవినాష్​ ఆశ్రయించడం ఉత్కంఠ రేపింది. సీబీఐ అధికారులు తనను అరెస్ట్​ చేస్తారనే ఉద్దేశంతో.. ​ ముందస్తు బెయిల్​ ఇవ్వాలని అవినాష్ పిటిషన్​ దాఖలు చేశారు. దాంతో ఏం జరుగుతోందో అనే అంశంపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. ముందస్తు బెయిల్​ పిటిషన్​పై విచారణ, అవినాష్​ సీబీఐ విచారణ రెండూ రేపటికి వాయిదా పడ్డాయి.

సీబీఐ విచారణ నేపథ్యంలో ముందస్తు బెయిల్​ మంజూరు చేయాలని కడప ఎంపీ అవినాష్​ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. దానిని రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్​పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ సురేందర్ ​విచారణ చేపట్టారు. అంతకుముందు అవినాష్​ పిటిషన్​పై ఇరువైపులా న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

ఎంపీ అవినాష్ తరఫున ఆయన సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్‌ రెడ్డి న్యాయవాది కోరారు. రేపు ఉ. 10.30కు విచారణకు రావాలని సీబీఐ నోటీసు ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం.. గతంలో అరెస్టు చేయలేదు కదా.. ఇప్పుడు ఆందోళన ఎందుకని ప్రశ్నించింది. అయితే దీనిపై సమాధానంగా.. నిన్న భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశారని న్యాయవాది తెలిపారు. అవినాష్​ను అరెస్టు చేసే అవకాశం ఉందని సీబీఐ కూడా చెబుతోందని అవినాష్‌ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

ఈ నెల 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించిందన్న సీబీఐ.. అవినాష్‌రెడ్డి విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని వాదించింది. అవసరమైతే తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని సీబీఐ పేర్కొంది. అవినాష్‌రెడ్డి సమక్షంలోనే సాక్ష్యాలు చేరిపేశారని వాదించిన సీబీఐ.. కేవలం దస్తగిరి వాంగ్మూలంపైనే ఆధారపడటం లేదని తెలిపింది. వివేకా హత్య కేసు దర్యాప్తులో అనేక ఆధారాలు సేకరించామని.. సీఆర్‌పీసీ 160 నోటీసు ఇచ్చినా.. ఆధారాల మేరకు అరెస్టు చేయవచ్చనే వాదన వినిపించింది. ఇరువైపులా వాదన విన్న న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.

అవినాష్‌రెడ్డిని రేపు సాయంత్రం 4 గంటలకు పిలవాలని హైకోర్టు సూచించగా.. అదే సమయంలో విచారించేందుకు సీబీఐ అంగీకారం తెలిపింది. అంతకుముందు అదుపులోకి తీసుకుంటారన్న అవినాష్‌ వ్యాఖ్యలపై సీబీఐ స్పందనను జడ్జి కోరారు. అవినాష్‌రెడ్డినీ అదుపులోకి తీసుకుంటామని సీబీఐ న్యాయవాది చెప్పినట్లు తెలిసింది. దీంతో ముందస్తు బెయిల్​ పిటిషన్​పై హైకోర్టు తీర్పు, సీబీఐ విచారణపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో అవినాష్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వేళ తన వాదనలు వినాలని వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.