Telangana Engineering Counselling 2023 : ఇంజినీరింగ్ తుది విడత సీట్లు కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పేర్కొంది. ఇంజినీరింగ్ కన్వీనర్ కోటా(Engineering Convenor Quota)లో 70,627 సీట్లను భర్తీ చేసినట్లు తెలిపింది. ఆ సీట్లను భర్తీ చేయగా ఇంకా కన్వీనర్ కోటాలో 13,139 సీట్లు మిగిలిపోయినట్లు ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ఆ మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 17 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది.
Engineering Seat Allotment in Telangana : రాష్ట్రంలో తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల(Engineering) భర్తీని గత నెలలోనే ఉన్నత విద్యామండలి పూర్తి చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో 70,665 ఇంజినీరింగ్ సీట్లను భర్తీ చేశారు. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 22న సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. దీంతో 85.48 శాతం సీట్లు భర్తీ అయినట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.
Telangana Engineering Seats : ఈసారి ఇంజినీరింగ్ సీట్లు ఎన్నంటే..?
Engineering Seats First Phase in Telangana 2023 : మొదటి విడతలో మూడు యూనివర్సిటీలు, 28 ప్రైవేటు కళాశాలల్లో సీట్లన్నీ నిండిపోయాయి. కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించిన కోర్సుల్లో 94.20 శాతం సీట్ల కేటాయింపు పూర్తి అయింది. ఈఈఈలో 58.38 శాతం, సివిల్‌లో 44.76 శాతం, మెకానికల్‌లో 38.50 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో ఈ ఏడాది కూడా కోర్ గ్రూప్‌లకు ఆదరణ బాగా కరువైంది.
Second Phase Engineering Seats Allotment in Telangana : ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల పంపిణీ ప్రక్రియలో కన్వీనర్ కోటాలో 7,417 మందికి సీట్లు దక్కగా.. మరో 25,148 మంది కళాశాల లేదా కోర్సులను మార్చుకున్నారు. రెండో విడతలో కన్వీనర్ కోటాలో 12,013 సీట్లు మిగిలాయి. దీంతో 82,702 సీట్లు కన్వీనర్ కోటాలో ఉండగా.. 70,689 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీన ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. కొన్ని కోర్సుల్లో అసలు ఒక్క సీటు కూడా నిండలేదు.
Engineering Seats in Telangana 2023 : రాష్ట్రంలో ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు
ఒక్కో ఇంజినీరింగ్ సీటుకు రూ.10లక్షల జరిమానా.. అసలు ఏమైందంటే?