TS EAMCET Results 2023 : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడులయ్యాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. సుమారు అన్ని విభాగాలు కలిపి 3 లక్షలకు పైగా విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో 21 జోన్లలో ఎంసెట్ పరీక్షను నిర్వహించారు. మే 10నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
TS EAMCET Results 2023 Released : ఎంసెట్ పరీక్షలకు ఇంజినీరింగ్ విభాగంలో 1,95,275 మంది విద్యార్థులు హాజరు కాగా.. అందులో 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో 1,06,514 మంది విద్యార్థులు హాజరు కాగా.. 86 శాతం మంది ఉత్తీర్ణతను పొందారు. ఎంసెట్ ఫలితాల్లోనూ బాలిక హవాయే కొనసాగింది. ఇంజినీరింగ్‌లో 82 శాతం బాలికలు.. 79 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించగా.. అగ్రికల్చర్‌లో 87 శాతం బాలికలు.. 84 శాతం బాలురు అర్హత పొందారు. ఎంసెట్ ఫలితాలు చెక్ చేసుకోవడానికి ఈ https://eamcet.tsche.ac.in/ క్లిక్ చేయండి.
అడ్మిషన్ ప్రక్రియ త్వరలోనే : ఫలితాలు విడుదల చేసిన అనంతరం విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది అడ్మిషన్ ప్రక్రియను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షలను సక్రమంగా నిర్వహించడానికి సహకరించిన అన్ని విభాగాలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ ఏడాది నిర్ణీత సమయానికే ఫలితాలు ఇచ్చామని అన్నారు.
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థుల హవా కొనసాగింది. అగ్రికల్చర్ విభాగంలో తొలి 10 ర్యాంకుల్లో 7 ఏపీ విద్యార్థులవే. ఇంజినీరింగ్ విభాగంలో తొలి 10 ర్యాంకుల్లో 8 ర్యాంకులు ఏపీ విద్యార్థులవే ఉన్నాయి. ఇంజినీరింగ్ విభాగంలో అత్యధిక మార్కులు: 158.89 కాగా.. అగ్రికల్చర్ విభాగంలో అత్యధిక మార్కులు 155.
ఇంజినీరింగ్‌లో మొదటి పది ర్యాంకులు సాధించిన వారి వివరాలిలా..
- ఇంజినీరింగ్‌లో ఎస్.అనిరుధ్(విశాఖ)కు ప్రథమ ర్యాంకు
- ఇంజినీరింగ్‌లో మణిందర్‌రెడ్డి(గుంటూరు)కి ద్వితీయ ర్యాంకు
- ఇంజినీరింగ్‌లో ఉమేష్ వరుణ్(నందిగామ)కు మూడో ర్యాంకు
- ఇంజినీరింగ్‌లో అభినీత్(హైదరాబాద్)కు నాలుగో ర్యాంకు
- ఇంజినీరింగ్‌లో ప్రమోద్ కుమార్ రెడ్డి(తాడిపత్రికి)కి ఐదో ర్యాంకు
- ఇంజినీరింగ్‌లో ధీరజ్ కుమార్(విశాఖ)కి ఆరో ర్యాంకు
- ఇంజినీరింగ్‌లో షన్వితారెడ్డి(నల్గొండ)కి ఏడో ర్యాంకు
- ఇంజినీరింగ్‌లో బి.సంజన(శ్రీకాకుళం)కి 8వ ర్యాంకు
- ఇంజినీరింగ్‌లో ప్రిన్స్ బ్రహ్మంరెడ్డి(నంద్యాల)కి 9వ ర్యాంకు
- ఇంజినీరింగ్‌లో ప్రణతి శ్రీజ(విజయనగరం)కి పదో ర్యాంకు
అగ్రికల్చర్‌లో మొదటి పది ర్యాంకులు సాధించిన వారి వివరాలిలా..
- అగ్రికల్చర్‌లో బి.జశ్వంత్(తూ.గో.)కు ప్రథమ ర్యాంకు
- అగ్రికల్చర్‌లో ఎన్.వెంకట్‌తేజ(చీరాల)కు ద్వితీయ ర్యాంకు
- అగ్రికల్చర్‌లో ఎస్.లక్ష్మి(హైదరాబాద్)కి తృతీయ ర్యాంకు
- అగ్రికల్చర్‌లో డి.కార్తికేయరెడ్డి(తెనాలి)కి నాలుగో ర్యాంకు
- అగ్రికల్చర్‌లో వరుణ్ చక్రవర్తి(శ్రీకాకుళం)కి ఐదో ర్యాంకు
- అగ్రికల్చర్‌లో గురు శశిధర్‌రెడ్డి(హైదరాబాద్)కి ఆరో ర్యాంకు
- అగ్రికల్చర్‌లో హర్షిల్ సాయి(నెల్లూరు)కి ఏడో ర్యాంకు
- అగ్రికల్చర్‌లో చిద్విలాసరెడ్డి(గుంటూరు)కి 8వ ర్యాంకు
- అగ్రికల్చర్‌లో గిరి వర్షిత(అనంతపురం)కి 9వ ర్యాంకు
- అగ్రికల్చర్‌లో ప్రీతమ్ సిద్దార్థ్ (హైదరాబాద్)కి పదో ర్యాంకు
ఎంసెట్ ఫలితాలు చెక్ చేసుకోవడానికి ఈ https://eamcet.tsche.ac.in/ క్లిక్ చేయండి.
ఇవీ చదవండి: