Telangana Congress MLA Candidates First List 2023 : కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను... ఏఐసీసీ విడుదల చేసింది. 55 మంది అభ్యర్థులతో... AICC జనరల్ సెక్రటరీ కె.సి.వేణుగోపాల్... ప్రకటన ఇచ్చారు. పలు దఫాల చర్చల అనంతరం.. అభ్యర్థుల పేర్లను అధిష్ఠానం ఉదయం ఖరారు చేసింది. వామపక్షాలతో కాంగ్రెస్ చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు.
Telangana Congress MLA Candidates First List 2023 : తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల - తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా
Published : Oct 15, 2023, 9:14 AM IST
|Updated : Oct 15, 2023, 2:50 PM IST
09:31 October 15
09:13 October 15
Congress MLA Candidates First List Telangana 2023 : తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు వివాదరహితమైన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు జాబితాను పరిశీలిస్తే స్పష్టం అవుతోంది. ప్రధానంగా ఎంఐఎంకు గట్టి పట్టున్న హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో ఏడు స్థానాలకు కాంగ్రెస్ టికెట్లు ప్రకటించింది. గత కొంతకాలంగా బీసీలకు అధికంగా సీట్లు కేటయించాలని డిమాండ్ చేస్తూ.. పలువురు నాయకులు దిల్లీ పెద్దలను కలిసి కోరారు. ఇదే అంశంపై కలిసేందుకు దిల్లీ వెళితే.. కాంగ్రెస్ పెద్దలు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమాన పరిచారని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
Telangana Congress MLA Candidates First List 2023 : ఇవాళ్టి మొదటి జాబితాలోని 55 పేర్లను పరిశీలిస్తే.. సామాజిక వర్గాల వారీగా దక్కిన సీట్లు రెడ్డిలకు అత్యధికంగా 17 నియోజకవర్గాల్లో టికెట్లు దక్కగా, బీసీలకు 12, ఎస్సీలకు 12, ఎస్టీలకు 2, వెలమ 7, బ్రాహ్మణ 2, ముస్లిం 3 లెక్కన టికెట్లు ఇచ్చారు. అయితే బీసీలకు ఇచ్చిన బీసీ టికెట్లను పరిశీలిస్తే.. యాదవ 2, కుర్మ2, ముదిరాజ్ 1, పద్మశాలి 1, మున్నూర్ కాపు 2, ఎంబీసీలకు ఇచ్చిన నాలుగింటిలో రజిక, మేరు, బొదల, వాల్మీకిలకు ఒక్కొక్క సీటు లెక్కన ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీలకు ఇచ్చిన 12 టికెట్లలో మాల-4, మాదిగ-8 లెక్కన కేటాయించారు. మొదటి జాబితా 55 నియోజకవర్గాలకుగాను ఆరుగురు మహిళలకు టికెట్లు దక్కాయి. అందులో సనత్‌నగర్ నుంచి కోట నీలిమ, గోషామహల్ నుంచి సునీతా ముదిరాజ్, గద్వాల్ నుంచి సరిత తిరుపతియ్య, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి ఇందిర, ములుగు నుంచి సీతక్కలకు టికెట్లు దక్కాయి. బీఆర్ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొత్తవారికి 13 మందికి ఈ మొదటి జాబితాలో టికెట్లు దక్కినట్లు తెలుస్తోంది.
Congress Releases 55 MLA Candidates For Telangana : మొత్తం 119 నియోజకవర్గాలకు 55 టికెట్లు ప్రకటించగా.. ఇంకా టికెట్లు ప్రకటించాల్సిన స్థానాలు 64 ఉండడంతో.. బీసీలకు అందులో కూడా పెద్ద పీఠ వేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. బీసీలకు మరో 12 నుంచి 15 టికెట్లు వరకు దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కామారెడ్డి బదులు ఎల్లారెడ్డి టికెట్ కావాలని షబీర్ అలీ పట్టుబట్టడంతో అక్కడ టికెట్ ప్రకటన పెండింగ్ పడినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం టికెట్ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అక్కడ ప్రకటించాల్సిన టికెట్లు కూడా అర్ధాంతరంగా ఆగినట్లు సమాచారం. అదేవిధంగా సూర్యాపేట, అంబర పేట, ఖైరతాబాద్, జూబ్లిహిల్స్ తదితర 20కి పైగా స్థానాలు ఏకాభిప్రాయం కుదరక తాత్కాలిక ఆగినట్లు తెలుస్తోంది.
రెండు మూడు రోజుల్లో ఇక్కడ సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయం సాధించి టికెట్లు ప్రకటనకు మార్గం సుగమం చేసుకోనున్నట్లు పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వామపక్షాల పొత్తుల వ్యవహారం కొలిక్కి వచ్చినప్పటికీ.. సీట్ల సర్దుబాటు కాకపోవడంతో పలు నియోజకవర్గాలకు టికెట్లు ప్రకటించకుండా నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో అయితే మధిర నుంచి భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి పోదెం వీరయ్యలు మినహా మిగిలిన ఎనిమిది స్థానాలను పెండింగ్‌లో ఉంచారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్లకు కూడా టికెట్లు కేటాయించకుండా ఆపినట్లు సమాచారం. సామాజిక వర్గాల వారీగా కూడా కొంత సమతూకం కోసం కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసిన నియోజక వర్గాలకు చెంది కొన్ని పేర్లను ఆపినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
55 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల వివరాలు :
వరుస సంఖ్య | నియోజకవర్గం పేరు | పోటీ చేయనున్న అభ్యర్థి పేరు |
1 | బెల్లంపల్లి(ఎస్సీ) | గడ్డం వినోద్ |
2 | మంచిర్యాల | ప్రేమ్‌సాగర్‌రావు |
3 | నిర్మల్ | శ్రీహరిరావు |
4 | ఆర్మూర్ | వినయ్‌కుమార్ రెడ్డి |
5 | బోధన్ | పి.సుదర్శన్‌రెడ్డి |
6 | బాల్కొండ | ముత్యాల సునీల్‌కుమార్ |
7 | జగిత్యాల | జీవన్‌రెడ్డి |
8 | ధర్మపురి(ఎస్సీ) | అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ |
9 | రామగుండం | ఎం.ఎస్.రాజ్‌ఠాకూర్ |
10 | మంథని | దుద్దిళ్ల శ్రీధర్‌బాబు |
11 | పెద్దపల్లి | చింతకుంట విజయరమణారావు |
12 | వేములవాడ | ఆది శ్రీనివాస్ |
13 | మానకొండూరు(ఎస్సీ) | కవ్వంపల్లి సత్యనారాయణ |
14 | మెదక్ | మైనంపల్లి రోహిత్‌రావు |
15 | ఆంధోల్(ఎస్సీ) | దామోదర రాజనర్సింహ |
16 | జహీరాబాద్(ఎస్సీ) | ఆగం చంద్రశేఖర్ |
17 | సంగారెడ్డి | జగ్గారెడ్డి |
18 | గజ్వేల్ | తూంకుంట నర్సారెడ్డి |
19 | మేడ్చల్ | తోటకూర వజ్రేశ్ యాదవ్ |
20 | మల్కాజిగిరి | మైనంపల్లి హన్మంతరావు |
21 | కుత్బుల్లాపూర్ | కొలన్ హన్మంత్ రెడ్డి |
22 | ఉప్పల్ | పరమేశ్వర్ రెడ్డి |
23 | చెవేళ్ల(ఎస్సీ) | భీమ్‌భరత్ |
24 | పరిగి | టి. రామ్మోహన్ రెడ్డి |
25 | వికారాబాద్(ఎస్సీ) | గడ్డం ప్రసాద్ కుమార్ |
26 | ముషీరాబాద్ | అంజన్‌కుమార్ యాదవ్ |
27 | మలక్‌పేట | షేక్ అక్బర్ |
28 | సనత్‌నగర్ | కోట నీలిమ |
28 | నాంపల్లి | ఫిరోజ్ ఖాన్ |
30 | కార్వాన్ | ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్‌హజ్రి |
31 | గోషామహల్ | మొగిలి సునీత |
32 | చాంద్రయణగుట్ట | బోయ నగేశ్ (నరేశ్) |
33 | యాకత్‌పుర | కె. రవి రాజు |
34 | బహదూర్‌పుర | రాజేశ్ కుమార్ పులిపాటి |
35 | సికింద్రాబాద్ | ఎ.సంతోష్ కుమార్ |
36 | కొడంగల్ | రేవంత్ రెడ్డి |
37 | గద్వాల | సరితా తిరుపతయ్య |
38 | అలంపూర్(ఎస్సీ) | సంపత్ కుమార్ |
39 | నాగర్‌కర్నూల్ | కె. రాజేశ్ రెడ్డి |
40 | అచ్చంపేట్(ఎస్సీ) | సీహెచ్ వంశీకృష్ణ |
41 | కల్వకుర్తి | కసిరెడ్డి నారాయణ్ రెడ్డి |
42 | షాద్ నగర్ | కె. శంకరయ్య |
43 | కొల్లాపూర్ | జూపల్లి కృష్ణారావు |
44 | నాగార్జున సాగర్ | కుందూరు జయవీర్ |
45 | హుజూర్ నగర్ | ఉత్తమ్ కుమార్‌రెడ్డి |
46 | కోదాడ | పద్మావతి రెడ్డి |
47 | నల్గొండ | కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి |
48 | నకిరేకల్(ఎస్సీ) | వేముల వీరేశం |
49 | ఆలేరు | బీర్ల ఐలయ్య |
50 | స్టేషన్ ఘన్‌పూర్(ఎస్సీ) | సింగాపురం ఇందిర |
51 | నర్సంపేట | దొంతి మాధవ్ రెడ్డి |
52 | భూపాలపల్లి | గండ్ర సత్యనారాయణ రావు |
53 | ములుగు(ఎస్టీ) | సీతక్క |
54 | మధిర(ఎస్సీ) | మల్లు భట్టి విక్రమార్క |
55 | భద్రాచలం(ఎస్టీ) | పొదెం వీరయ్య |

TAGGED:
Telangana Congress