Telangana Assembly Elections Schedule 2023 : నేడు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు (Elections) నగారా మోగనుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను మధ్యాహ్నం 12 గంటలకు సీఈసీ రాజీవ్‌కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది.
TS Assembly Elections 2023 : 'ఈ దఫా ఎన్నికల్లో అన్నీ కొత్త ఈవీఎంలే'
5 State Assembly Election 2023 : తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అలానే నిర్వహించారు. అయితే పోలింగ్ తేదీలు మాత్రం ఐదు రాష్ట్రాలకు వేర్వేరుగా ఉంటాయని సమాచారం. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 10 నుంచి 15 మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. మిజోరం శాసనసభ గడువు డిసెంబర్ 17తో ముగియనుంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాజస్థాన్ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో వివిధ తేదీల్లో ముగుస్తాయి.
Final Voter List Released in Telangana : 3,17,17,389 ఓటర్లతో తుది జాబితా రెడీ..
తెలంగాణలో 119 స్థానాలకు.. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు, రాజస్థాన్‌లో 200 స్థానాలకు.. ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలకు, మిజోరాంలో 40 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు.. వ్యూహాన్ని ఖరారు చేయడానికి సీఈసీ.. ఎన్నికల పరిశీలకులతో సంప్రదింపులు జరిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయడం సహా.. క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధన ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని ఈసీ అమలు చేయనుంది. ఇందుకోసం పోలీసులు, ఇతర విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో సమీక్ష జరిపింది. తుది ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం (Central Election Commission Team) .. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పర్యటించింది. అక్కడ ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు నిర్వహించింది.
తెలంగాణలో ఓటర్ల సంఖ్య ..
- తెలంగాణలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారు..
- తెలంగాణలో 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4.43 లక్షల మంది..
- తెలంగాణలో వందేళ్లు దాటిన ఓటర్లు 7,689..
- తెలంగాణలో తొలిసారి ఓటు హక్కు పొందినవారు 8.11 లక్షలు..
- తెలంగాణలో మొత్తం దివ్యాంగుల సంఖ్య 5.06 లక్షలు..
తెలంగాణలో 12 ఎస్టీ, 18 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం పోలింగ్ కేంద్రాలు 35,356 కాగా.. ఇందులో 27,798 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఉంది. ఈ ఎన్నికల కోసం 72,000ల బ్యాలెట్ యూనిట్లు.. 57,000ల కంట్రోల్ యూనిట్లు.. 56,000ల వీవీ ప్యాట్ యంత్రాలను ఉపయోగించనున్నారు.