ETV Bharat / bharat

Telangana Assembly Election Results 2023 : తెలంగాణలో ఎంత మంది సిట్టింగ్​ ఎమ్మెల్యేలు ఓడిపోయారో మీకు తెలుసా? - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023

Telangana Assembly Election Results 2023 : తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో కొందరు తొలిసారి పోటీ చేసి ఊహించని విజయం సాధించారు.. మరికొందరు రాజకీయ దురంధరులు ఓడిపోయారు.. అయితే, సిట్టింగ్​ ఎమ్మెల్యేల్లో ఎంత మంది ఓడిపోయారో మీకు తెలుసా..?

Telangana Assembly Election Results 2023

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 7:56 PM IST

Telangana Assembly Election Results 2023 : తెలంగాణ శాసనసభ సమరంలో కాంగ్రెస్‌ విజయ ఢంకా మోగించింది. దీంతో పెద్ద సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతయ్యాయి. మరి.. ఎవరెవరు ఓడిపోయారు? వారిపై ఎవరు గెలిచారు? అనే వివరాలను జిల్లాల వారీగా చూద్దాం.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓడిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీరే..

నల్గొండ : ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి విజయం సాధించారు. దాదాపు 50వేల బంపర్ మెజార్టీతో గెలుపొందారు.

మునుగోడు : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మునుగోడు ఉపఎన్నికల్లో గెలుపొందిన బీఆర్​ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై.. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు.

నకిరేకల్ : ఇక్కడ కాంగ్రెస్​ నుంచి బీఆర్​ఎస్​లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన వేముల వీరేశం భారీ తేడాతో గెలుపొందారు.

ఆలేరు : ఈ నియోజకవర్గంలో బీఆర్​ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్​రెడ్డిపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బీర్ల ఐలయ్య ఘన విజయం సాధించారు.

తుంగతుర్తి : తుంగతుర్తి(ఎస్సీ) నియోజకవర్గంలో బీఆర్​ఎస్ సిట్టింగ్ శాసనసభ్యుడు గాదరి కిషోర్​పై కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేలు బంపర్ మెజార్టీతో గెలుపొందారు.

భువనగిరి : ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్​కుమార్​రెడ్డి ఘన విజయం సాధించారు.

నాగార్జున సాగర్ : దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుమారుడు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్​పై కాంగ్రెస్ కురువృద్ధుడుగా పేరు పొందిన కుందూరు జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి భారీ ఆధిక్యంతో గెలుపొందారు.

హుజూర్​నగర్​ : ఈ నియోజకవర్గంలో ఉపఎన్నికల్లో గెలుపుపొందిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిపై మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​రెడ్డి భారీ విజయం సాధించారు. దాదాపు 40వేలకు పైగా మెజార్టీతో ఉత్తమ్ గెలుపొందారు.

కోదాడ : ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​పై కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి విజయం సాధించారు.

మిర్యాలగూడ : మిర్యాలగూడలో బీఆర్​ఎస్ సిట్టింగ్ శాసనసభ్యులు భాస్కర్​రావుపై హస్తం పార్టీ నుంచి పోటీ చేసిన బత్తుల లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే విజయకేతనం ఎగురవేశారు.

దేవరకొండ : ఎస్టీ నియోజకవర్గమైన ఇక్కడ బీఆర్​ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రకుమార్​పై చెయ్యి పార్టీ నుంచి పోటీ చేసిన బాలు నాయక్ విజయం సాధించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓడిన సిట్టింగ్ ఎమ్మెల్యేల వివరాలిలా..

పినపాక(ఎస్టీ) : ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించారు.

ఇల్లెందు(ఎస్టీ) : బీఆర్ఎస్ సిట్టింగ్ శాసన సభ్యురాలు బానోతు హరిప్రియపై హస్తం పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆమె గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది బీఆర్​ఎస్​లో చేరారు.

ఖమ్మం : 2018 ఎన్నికల్లో బీఆర్​ఎస్​ నుంచి విజయం సాధించిన ఏకైక ఎమ్మెల్యే క్యాండిడేట్, మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​పై తుమ్మల నాగేశ్వరరావు భారీ మెజార్టీతో విజయం సాధించారు.

పాలేరు : ఖమ్మం రాజకీయాల్లో ఎప్పుడూ ఆసక్తిని రేపే పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్​రెడ్డిపై బీఆర్​ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరిన పొంగులేటి శ్రీనిపాస్​రెడ్డి విజయకేతనం ఎగురవేశారు.

వైరా(ఎస్టీ) : ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాలోతు రాందాస్ చేతిలో పరాజయం చవిచూశారు.

సత్తుపల్లి(ఎస్సీ) : ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హస్తం పార్టీ నుంచి బరిలో దిగిన మట్టా రాగమయి చేతిలో ఓటమి చెదారు.

కొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో కీలక నియోజకవర్గమైన కొత్తగూడెంలో బీఆర్​ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ నుంచి పోటీలో దిగిన కూనంనేని సాంబశివరావు చేతిలో పరాజయం పాలయ్యారు.

అశ్వారావుపేట(ఎస్టీ) : సిట్టింగ్ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుపై చెయ్యి పార్టీ నుంచి బరిలో దిగిన ఆదినారాయణరావు ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వెలువడిన మొదటి ఫలితమిదే.

భద్రాచలం(ఎస్టీ) : రాములవారు కొలువుదీరిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు చేతిలో ఓటమి పాలయ్యారు.

Telangana Election LIVE UPDATES : ఎన్నికల్లో గెలిచిన కుటుంబ సభ్యులు వీరే!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరాజయం చవిచూసిన సిట్టింగ్ ఎమ్మెల్యేల జాబితా..

పాలకుర్తి : ఇక్కడ 4సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు పరాభవం తప్పలేదు. ఈయనపై కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి ఘనవిజయం సాధించారు.

డోర్నకల్‌(ఎస్టీ) : కాంగ్రెస్‌ అభ్యర్థి రామచంద్రనాయక్‌ చేతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఓటమి చవిచూశారు. విజయం

మహబూబాబాద్(ఎస్టీ) : ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మురళీనాయక్‌ చేతిలో ప్రస్తుత శాసనసభ్యుడు శంకర్ నాయక్ పరాజయం పాలయ్యారు.

నర్సంపేట : ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి ఘన విజయం సాధించారు.

పరకాల : ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హస్తం పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్​రెడ్డి గెలుపొందారు.

వరంగల్‌ తూర్పు : కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఓటమి చవిచూశారు.

వరంగల్ పశ్చిమ : ఈ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్​పై కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి గెలుపొందారు.

వర్ధన్నపేట : ఇక్కడ ప్రస్తుత శాసనసభ్యుడు ఆరూరి రమేశ్​ కాంగ్రెస్‌ అభ్యర్థి నాగరాజు చేతిలో పరాజయ పాలయ్యారు.

భూపాలపల్లి : బీఆర్​ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి సత్యనారాయణరావు విజయ బావుట ఎగరవేశారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఓటమి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేల వివరాలిలా..

కొడంగల్‌ : బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఘన విజయం సాధించారు.

నారాయణపేట : కాంగ్రెస్‌ అభ్యర్థి పర్ణికారెడ్డి చేతిలో ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్ రాజేందర్​రెడ్డి పరాజయం పాలయ్యారు.

మహబూబ్‌నగర్‌ : బీఆర్​ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్​పై హస్తం పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు.

దేవరకద్ర : సిట్టింగ్ బీఆర్ఎస్​ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి జి. మధుసూదన్​రెడ్డి గెలుపొందారు.

జడ్చర్ల : ప్రస్తుత బీఆర్​ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్‌రెడ్డి గెలుపొందారు.

మక్తల్‌ : కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీహరి చేతిలో బీఆర్ఎస్ సిట్టింగ్ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్​రెడ్డి ఓడిపోయారు.

వనపర్తి : బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి హస్తం పార్టీ అభ్యర్థి మేఘారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.

నాగర్‌కర్నూల్‌ : ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి కె.రాజేష్‌రెడ్డి విజయం సాధించారు.

అచ్చంపేట(ఎస్సీ) : అచ్చంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ చేతిలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఓటమి చెందారు.

కల్వకుర్తి : హస్తం పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి చేతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల యాదవ్ పరాజయం చెందారు.

షాద్‌నగర్‌ : బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అంజయ్యపై కాంగ్రెస్‌ అభ్యర్థి శంకరయ్య విజయం సాధించారు.

కొల్లాపూర్‌ : కాంగ్రెస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు చేతిలో ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి ఓటమి చెందారు.

Telangana Assembly Election Results 2023 Live News : గెలుపు గుర్రాలుగా బరిలో దిగి ఓటమితో సరి - ఓడిపోయిన మంత్రుల లిస్ట్​ ఇదే

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఓడిన ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..

మెదక్ : ఇక్కడ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్​రావు విజయం సాధించారు.

నారాయణ్‌ఖేడ్‌ : కాంగ్రెస్‌ అభ్యర్థి సంజీవ్‌రెడ్డి చేతిలో సిట్టింగ్ శాసనసభ్యుడు భూపాల్​రెడ్డి ఓటమి పాలయ్యారు.

ఆందోల్‌(ఎస్సీ) : బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్​పై కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర రాజనరసింహ విజయం సాధించారు.

సంగారెడ్డి : ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు.

దుబ్బాక : బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్​రావుపై బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్​రెడ్డి విజయం సాధించారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓటమి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు..

ఇబ్రహీంపట్నం : సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మల్​రెడ్డి రంగారెడ్డి చేతిలో ఓడిపోయారు.

పరిగి : సిట్టింగ్ బీఆర్​ఎస్ ఎమ్మెల్యే మహేష్​రెడ్డిపై హస్తం పార్టీ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి గెలుపొందారు.

వికారాబాద్‌(ఎస్సీ) : కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ చేతిలో బీఆర్​ఎస్ సిట్టింగ్ అభ్యర్థి మెతుకు ఆనంద్ ఓటమి పొందారు.

తాండూరు : బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యే పైలట్ రోహిత్​రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి బి. మనోహర్​రెడ్డి విజయం సాధించారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పరాజయం పొందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు..

ఆర్మూర్‌ : బీజేపీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి చేతిలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి ఓటమి చెందారు.

బోధన్‌ : బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్​పై కాంగ్రెస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్​ రెడ్డి విజయం సాధించారు.

జుక్కల్‌(ఎస్సీ) : కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు చేతిలో బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఓటమి పాలయ్యారు.

ఎల్లారెడ్డి : బీఆర్ఎస్ సిట్టింగ్ జూజుల సురేందర్​పై కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్‌రావు విజయకేతనం ఎగురవేశారు.

నిజామాబాద్ అర్బన్‌ : సిట్టింగ్ బీఆర్ఎస్ అభ్యర్థి బిగల గణేష్ గుప్తాపై బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌ సూర్యనారాయణ ఘన విజయం సాధించారు.

నిజామాబాద్ రూరల్‌ : కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి చేతిలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరాజయం చవిచూశారు.

Telangana Assembly Election Results 2023 Live Updates : తెలంగాణలో హస్తానిదే అధికారం - కాంగ్రెస్​ గెలుపునకు దారితీసిన అంశాలివే

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఓటమి చెందిన సిట్టింగ్ శాసనసభ్యులు..

ధర్మపురి(ఎస్సీ) : బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

రామగుండం : కాంగ్రెస్ అభ్యర్థి రాజ్​ఠాకూర్ చేతిలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరాజయం పొందారు.

పెద్దపల్లి : బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మనోహర్​రెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్ విజయరమణారావు చేతిలో ఓడిపోయారు.

చొప్పదండి(ఎస్సీ) : హస్తం పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం చేతిలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఓటమి పాలయ్యారు.

మానకొండూరు(ఎస్సీ) : బీఆర్​ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ చేతిలో పరాజయం పొందారు.

హుజూరాబాద్‌ : ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్​రెడ్డి చేతిలో ఓడిపోయారు.

హుస్నాబాద్ : బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యే సతీష్​పై కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ భారీ మెజార్టీతో విజయ సాధించారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఓడిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీరే..

సిర్పూర్‌(ఎస్సీ) : బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీజేపీ అభ్యర్థి హరీశ్​బాబు చేతిలో ఓటమి చెందారు.

చెన్నూరు(ఎస్సీ) : కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ చేతిలో బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యే బాల్క సుమన్ ఓడిపోయారు.

బెల్లంపల్లి(ఎస్సీ) : ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హస్తం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గడ్డి వినోద్ చేతిలో పరాజయం పాలయ్యారు.

మంచిర్యాల : బీఆర్​ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్​రావు కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్​సాగర్​రావు చేతిలో ఓటమి చెందారు.

ఆదిలాబాద్‌ : బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ చేతిలో బీఆర్​ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న పరాజయం చవిచూశారు.

నిర్మల్‌ : బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీజేపీ అభ్యర్థి మహేశ్వర్​రెడ్డి చేతిలో ఓడిపోయారు.

ముథోల్ : బీజేపీ అభ్యర్థి రామారావు పవార్ చేతిలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పరాజయం పాలయ్యారు.

Telangana Election Result 2023 LIVE: కాంగ్రెస్​కు కలిసొచ్చిన వారసత్వ రాజకీయం - విజయతీరాలకు ఆ కుటుంబాలు

CM KCR Resigned : ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా - గవర్నర్​కు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.