Teacher Consume Alcohol: విద్యాబుద్ధులు నేర్పి భావితరాలను తయారు చేయాల్సిన ఉపాధ్యాయుడు మద్యానికి బానిస అయ్యాడు. పూటుగా మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. మత్తులో ఓ విద్యార్థిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జశ్పుర్లో జరిగింది.
మార్చి 10న ఉపాధ్యాయుడు దినేష్ కుమార్ లక్ష్మే.. మద్యాన్ని సేవించి స్కూల్‌కు వచ్చాడు. తరగతి గదిలో విద్యార్థిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టాడు. పోలీసులకు సమాచారం అందించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు.
ఇదీ చదవండి: భర్త తల నరికి.. గుడి దగ్గర ప్లాస్టిక్ సంచిలో...