కర్ణాటక తుమకూరులోని చిక్కనాయకనహళ్లి గ్రామంలో దారుణం జరిగింది. దుస్తుల్లో మూత్రం పోస్తున్నాడనే కారణంతో మూడేళ్ల చిన్నారి ప్రైవేట్ భాగాలను కాల్చారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాలుడు తరచుగా దుస్తుల్లోనే మూత్ర విసర్జన చేసేవాడు. దీంతో అంగన్వాడీ టీచర్, సహాయకురాలు ఆగ్రహంతో ఊగిపోయారు. అగ్గిపుల్లతో బాలుడి ప్రైవేట్ భాగాలను కాల్చారు.
నోటీసులు జారీ చేసిన అధికారులు:
దీంతో బాలుడి ప్రైవేట్ భాగాలతో పాటు తొడలు సైతం స్వల్పంగా కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న జిల్లా బాలల సంరక్షణ అధికారులు.. హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అంగన్వాడీ టీచర్, హెల్పర్‌కు నోటీసులు జారీ చేశారు.
ఇవీ చదవండి: లోయలో పడ్డ కారు.. 8 మంది మృతి
కేజ్రీవాల్‌పై అన్నా హజారే ఫైర్.. అధికార మత్తులో మునిగిపోయారంటూ..