విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలో ఓ టీ కొట్టు యజమానిని షాక్‌కు గురిచేసింది. అతని దుకాణానికి రూ. 55 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. ఇది చూసిన స్థానికులు విద్యుత్తు అధికారుల తీరుపై విమర్శలు చేశారు.
ఇదీ జరిగింది...
జిల్లాలోని హరోలీలో ప్రాంతంలో నరేశ్ కుమార్ అనే వ్యక్తి టీ కొట్టు నడుపుతున్నాడు. ఇటీవల నాలుగు నెలలకుగానూ అతనికి రూ. 6,702 బిల్లు వేసింది విద్యుత్ శాఖ. దానిని అతను చెల్లించలేదు. దీంతో అధికారులు అతని దుకాణానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. చేసేది ఏం లేక బకాయిలను ఆన్లైన్లో చెల్లించాలని పోర్టల్‌లో చూశాడు. అంతే అక్కడ ఉన్న బిల్లును చూసి షాక్‌కు గురయ్యాడు. అందులో రూ. 6 వేలకు బదులుగా.. రూ. 55 లక్షల 14వేల 945 కనిపించింది. ఒక్కసారిగా నివ్వెరపోయిన అతను విద్యుత్ బోర్డ్‌ను ఆశ్రయించాడు.
పొరపాటుగా ఎక్కువగా చూపిస్తోందని పేర్కొన్న విద్యుత్తు శాఖ అధికారులు.. సరి చేస్తామని చెప్పారు.
ఇదీ చూడండి: వైరల్: మెట్రో ఎక్కిన వానరం.. ఆహ్లాదకరంగా ప్రయాణం!