ETV Bharat / bharat

చరిత్ర ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది: చంద్రబాబు - chandrabAbu comments

Chandrababu Naidu Comments చరిత్ర ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29 అని.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో వెల్లడించారు. ఎక్కడ పసుపు ఉంటే అక్కడ శుభసూచకమని వెల్లడించారు.

Chandrababu Naidu at NTR Ghat
Chandrababu Naidu at NTR Ghat
author img

By

Published : Mar 29, 2023, 8:01 PM IST

Updated : Mar 30, 2023, 6:35 AM IST

చరిత్ర ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది: చంద్రబాబు

Chandrababu Naidu Comments మార్చి 29.. రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు అని టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు పేర్కొన్నాడు. హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. అధికారం కావాలని ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాలేదని చంద్రబాబు వెల్లడించారు. తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని పార్టీ పెట్టారని స్పష్టం చేశారు. తెలుగుజాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశమని చెప్పినట్లు వెల్లడించారు. తెలుగుజాతి వసుదైక కుటుంబంగా ఉండడం మనందరి అదృష్టమని తెలిపారు. తెలుగుజాతిని ఉద్ధరించడానికి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్‌ తెచ్చిన పాలనా సంస్కరణలు చరిత్రలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. మానవత్వమే తన సిద్ధాంతమని చాటి చెప్పారన్నారు. ఎక్కడ పసుపు ఉంటే అక్కడ శుభసూచకమన్న చంద్రబాబు.. అందరి అవసరం కోసం.. అందరి కోసం తెలుగుదేశం పార్టీ ఉందని వివరించారు.

మార్చ్ 29 చరిత్రను తిరగరాసింది. తెలుగుజాతి రుణం తీర్చుకోవాలి ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. పది కోట్ల తెలుగువారు ఒక కుటుంభం దానికి ప్రతినిధి టీడీపీ. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ గుర్తు ఉంటారు. ఆహార భద్రతపై ఆలోచించింది ఎన్టీఆర్. ప్రజలవద్దకు పరిపాలన తెచ్చేందుకు మండల వ్యవస్త తెచ్చారు అది వికేంద్రీకరణ. యుగ పురుషుడి శత జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. - చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు

చరిత్ర ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. టీడీపీకు ముందు.. తర్వాత అని తెలుగుజాతి గురించి మాట్లాడే పరిస్థితి నెలకొందని వెల్లడించారు. సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం అని గొంతెత్తారు. ఆహార భద్రత కోసం రూ.2కు కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు. సంస్కరణలకు మారుపేరు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. పటేల్‌ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌ అని ప్రశంసించారు. నిరుపేదలను చదివించాలని రెసిడెన్షియల్‌ స్కూళ్లు ప్రవేశపెట్టారని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీ తెచ్చారన్నారు.

ఆడబిడ్డలకు ఆస్తిలో సమానహక్కు ఇచ్చారు. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారు. నేను వచ్చాక రిజర్వేషన్లను 34 శాతానికి పెంచాను. తెలుగుజాతి చిహ్నం... ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్‌. రాజమహేంద్రవరంలో మహానాడు సభ ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు నిర్వహిస్తాం. తెలుగుజాతి గర్వపడేలా భవిష్యత్తుకు నాంది పలికేలా కార్యక్రమాలు చేపడుతాం. - చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు

ఎన్టీఆర్‌కు గౌరవ సూచకంగా కేంద్రం రూ.100 వెండి నాణెం విడుదల చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ హయాంలో సంస్కరణలు తీసుకువచ్చామని వ్యాఖ్యానించారు. విద్యుత్‌, పోర్టులు, రోడ్లు తదితర రంగాల్లో సంస్కరణలు తెచ్చామని వివరించారు. మహిళలకు చేయూత కోసం డ్వాక్రా సంఘాలు తీసుకువచ్చామని వెల్లడించారు. ఈ క్రమంలోనే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై నిప్పులు చెరిగారు.

ఆంధ్రప్రదేశ్​లో గన్, గంజాయి, గొడ్డలి కల్చర్ తెచ్చారని మండిపడ్డారు. దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తన తరువాత వచ్చిన వైఎస్, కేసీఆర్ వంటి ముఖ్యమంత్రులు.. తాను చేసిన అభివృద్ధిని కొనగగించారని చెప్పారు. వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఆర్ధికంగా , సామాజికంగా స్థిరపడిన ప్రతి ఒక్కరు తమ శక్తి మేరకు మరో కుటుంబం.. లేదా మరికొందరిని దత్తత తీసుకుని వృద్ధిలోకి తెచ్చేందుకు కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు

ఇవీ చూడండి:

Last Updated : Mar 30, 2023, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.