TDP Leaders Performed Pujas for Chandrababu: చంద్రబాబు త్వరగా విడుదల కావాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబు కోసం మేము సైతం అంటూ నినదించారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని నేతలు ఆరోపించారు. తమ అధినేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Guntur District.. గుంటూరు జిల్లా పొన్నూరులో చేపట్టిన రిలే నిరాహారదీక్షలో ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు.
Visakhapatnam.. విశాఖలో చంద్రబాబు విడుదలవ్వాలని కోరుతూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నగరంలోని వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక పూజలు చేశారు.
YSR Kadapa District.. వైఎస్సార్ కడప జిల్లాలో కడప శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు 101 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. జమ్మలమడుగులో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఎర్రగుంట్ల మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడ్డి, శివనాథరెడ్డి, సీపీఐ నాయకులు దీక్షకు సంఘీభావం తెలిపారు.
IT Employees Car Rally in Hyderabad : చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ
Srikakulam District.. శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు తర్వగా విడుదల కావాలని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి ఆధ్వర్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఎచ్చెర్లలో మాజీ మంత్రి కళా వెంకట్రావు ఆధ్యర్యంలో ర్యాలీ చేపట్టారు, శివాలయంలో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Anakapalli District.. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక వేంకన్న ఆలయంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు టెంకాయలు కొట్టి మొక్కుకున్నారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొలేక అక్రమ అరెస్టు చేశారని అనిత మండిపడ్డారు.
West Godavari District.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ రామ్మోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని.. తర్వగా జైలు నుంచి విడుదల కావాలని పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
East Godavari District.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి దీక్షా శిబిరంలో వినూత్నంగా నిరసన తెలిపారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ పార్టీ శ్రేణులతో కలిసి కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై బైఠాయించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Dr. BR Ambedkar Konaseema District.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో టీడీపీ శ్రేణులు సంకెళ్లు లాగా చేతికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు.
Elur.. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్‌లో మహిళలు నల్ల చీరలు ధరించి మోకాళ్లపై నిలబడి పెద్దఎత్తున నిరసన తెలిపారు.
Parvathipuram Manyam District.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో వివిధ గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైకో పోవాలి-సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబును విడుదల చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని నేతలు తేల్చి చెప్పారు.
Krishna District.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం శ్రేణులు కదం తొక్కారు. జగ్గయ్యపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి మోకాళ్లపై వెళ్లి పూజలు చేశారు. నందిగామ రైతు పేటలోని టీడీపీ కార్యాలయంలో చేపట్టిన దీక్షలో తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. జనసేన నేతలు భారీగా తరలివచ్చి దీక్షకు సంఘీభావం తెలిపారు. తోట్లవల్లూరు మండలం గరికిపర్రు గ్రామస్థులు నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని మౌన దీక్ష చేపట్టారు.
Bapatla District: బాపట్ల జిల్లా చీరాలలోని తెలుగు మహిళలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. మంగళగరిలో టీడీపీ శ్రేణులు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు.
Annamaya District.. అన్నమయ్య జిల్లా రాజంపేటలో చేపట్టిన దీక్షకు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు.
Anantapur District.. అనంతపురం జిల్లా ఉరవకొండలోని చంద్రబాబు విడదలవ్వాలని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మోకాళ్ల మీద ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు.
Sathya Sai District.. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంటలోని మహిళలు చంద్రబాబు విడదలవ్వాలని గ్రామ దేవత గంగమ్మకు బోనాలు సమర్పించారు.
Prakasam District.. ప్రకాశం జిల్లా కనిగిరిలో చేపట్టిన రిలే నిరాహారదీక్షకు జనసేన, సీపీఐ నేతలు మద్దతు తెలిపారు.
Nellore District.. నెల్లూరు జిల్లా ఏస్ పేటలో హజాత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో ఎమ్మెల్యే ఆనం రామానారాయణ రెడ్డి ప్రార్థనలు చేశారు.