అరేబియా తీర ప్రాంతాలను హడలెత్తిస్తున్న తౌక్టే తుపాను సోమవారం రాత్రి.. గుజరాత్ తీరాన్ని తాకింది. ఆ రాష్ట్రంలోని పోర్బందర్-మహువా మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకి తీవ్ర తుపానుగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించినట్టు పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్ర తీరంలో గంటకు సుమారు 185 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తున్నాయంది. రెండు గంటలపాటు ఇది తీవ్ర ప్రభావం చూపి.. ఆ తర్వాత బలహీనపడే అవకాశముందని వెల్లడించింది.
తౌక్టే ప్రభావంతో.. వెరవల్-సోమనాథ్ తీరంలో భారీఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. ఈ తుపాను ప్రభావంతో అప్రమత్తమైన అధికారులు.. గుజరాత్లో ఇప్పటికే సుమారు లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల్లో భాగంగా.. 54 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి.
-
#WATCH | Earlier visuals from Veraval - Somnath in Gujarat as the sea turned rough in wake of #CycloneTauktae.
— ANI (@ANI) May 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Extremely severe cyclonic storm Tauktae lies close to the Gujarat coast. The landfall process has started and will continue during next 2 hours, says IMD. pic.twitter.com/7KojZcXS27
">#WATCH | Earlier visuals from Veraval - Somnath in Gujarat as the sea turned rough in wake of #CycloneTauktae.
— ANI (@ANI) May 17, 2021
Extremely severe cyclonic storm Tauktae lies close to the Gujarat coast. The landfall process has started and will continue during next 2 hours, says IMD. pic.twitter.com/7KojZcXS27#WATCH | Earlier visuals from Veraval - Somnath in Gujarat as the sea turned rough in wake of #CycloneTauktae.
— ANI (@ANI) May 17, 2021
Extremely severe cyclonic storm Tauktae lies close to the Gujarat coast. The landfall process has started and will continue during next 2 hours, says IMD. pic.twitter.com/7KojZcXS27
విమానాశ్రయాలు బంద్..
తుపాను కారణంగా గుజరాత్లో విమానాశ్రయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అక్కడి అధికారులు ప్రకటించారు. రాజ్కోట్ విమానాశ్రయం మినహా.. అన్ని విమానాశ్రయాలను ఈ నెల 19 వరకు మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు. మరో మూడు విమానాశ్రయాలు అహ్మదాబాద్, సూరత్, వడోదర విమానాశ్రాయాలు మంగళవారం వరకు మూతపడనున్నాయి.
కర్ణాటకలో 121 గ్రామాలపై ప్రభావం..
తౌక్టే తుపాను ధాటికి కర్ణాటకలోని సుమారు 121 గ్రామాలు ప్రభావితమయ్యాయి. బాధిత గ్రామాల్లో గరిష్ఠంగా.. ఉత్తర కన్నడ జిల్లాలోని 48 గ్రామాలున్నాయి. ఆ రాష్ట్రంలోని మల్నాడ్ జిల్లా పరిసర ప్రాంతాల్లో పడవ మునక సహా పలు వేర్వేరు ఘటనల్లో ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్రలో ఆరుగురు మృతి..
'తౌక్టే' ప్రభావంతో గంటకు 185 కిలోమీటర్ల వేగంగతో వీస్తున్న గాలులు మహారాష్ట్రలో విధ్వంసం సృష్టించాయి. తుపాను బీభత్సంతో.. కొంకణ్ ప్రాంతంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రెండు పడవలు నీట మునగగా.. ముగ్గురు నావికుల ఆచూకీ గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం మహారాష్ట్ర తీరం దాటి వెళ్లనుండగా.. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:అతితీవ్ర తుపానుగా తౌక్టే- 'మహా'లో విధ్వంసం