ETV Bharat / bharat

తమిళ పోరు.. కీలక స్థానాల్లో గెలుపెవరిది..? - ttv dinakaran

తమిళనాడులో అన్నాడీఎంకే మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుండగా, డీఎంకే మాత్రం ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని శ్రమిస్తోంది. వారితో పాటే కమల్ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కీలక నియోజకవర్గాల్లో ముఖ్య నేతల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.

tamilnadu assembly elections key candidates
తమిళ పోరు.. కీలక స్థానాల్లో గెలుపెవరిది..?
author img

By

Published : Apr 3, 2021, 5:43 AM IST

Updated : Apr 3, 2021, 6:49 AM IST

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్నవేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే కూటములతో పాటు కొత్త పార్టీలు హోరాహోరీ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. రాజకీయ దిగ్గజాలు జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికల సంగ్రామం ఇదే కావడం వల్ల అక్కడి రాజకీయాలపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో తమిళనాడులో కీలకంగా ఉన్న పలు అసెంబ్లీ నియోజకవర్గాలు, కీలక నేతల పరిస్థితి ఎలా ఉందో పరిశీలిద్దాం..

కంచుకోట నుంచి పళనిస్వామి..

tamilnadu assembly elections key candidates
పళనిస్వామి

ఈ సారి ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామిపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. అన్నాడీఎంకేలో 1974లో ఓ వాలంటీర్‌గా అడుగుపెట్టిన పళనిస్వామి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. జయలలిత మరణం తర్వాత పన్నీర్‌ సెల్వం ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటికీ, కొంతకాలానికే ఆయన రాజీనామాతో పళనిస్వామి సీఎం పీఠమెక్కారు. ఇప్పటికే నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందిన పళనిస్వామి, ఎడప్పాడి స్థానం నుంచి మరోసారి గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 37 ఏళ్ల సంపత్‌కుమార్‌ను డీఎంకే పోటీలో నిలబెట్టింది. స్థానిక వ్యక్తిగా ఉన్న తనకు ఇక్కడి సమస్యలపై పోరాటం చేస్తానని.. ముఖ్యమంత్రిపై గెలిపించాలని సంపత్‌ కుమార్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉన్న ఎడప్పాడి నియోజకవర్గంలో తాను మరోసారి గెలుస్తానని పళని స్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బోడినాయక్కనూర్‌పైనే పన్నీర్‌సెల్వం..

పన్నీర్ సెల్వం

ఓపీఎస్‌గా పేరొందిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరో కీలక వ్యక్తి అనే చెప్పుకోవచ్చు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పన్నీర్‌ సెల్వం తాజాగా తేని జిల్లాలోని బోడినాయక్కనూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత రెండు పర్యాయాలుగా ఆయన బోడినాయక్కనూర్‌ నుంచే పోటీచేసి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో అన్నాడీఎంకేకు మంచి పట్టున్నప్పటికీ డీఎంకే నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. గత ఎన్నికల్లో ప్రత్యర్థిపై 8శాతం ఓట్ల మెజారిటీతో పన్నీర్‌ విజయం సాధించారు. అయితే, అన్నాడీఎంకే నుంచి ఆండిపట్టి నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలుపొందిన తంగా తమిళ్‌సెల్వం ఈసారి డీఎంకేలో చేరిపోయారు. డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం నియోజకవర్గమైన బోడినాయక్కనూర్ నుంచి తంగా తమిళ్‌సెల్వంను డీఎంకే బరిలో దింపింది. దీంతో ఈసారి అక్కడ ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: 'అభివృద్ధి పేరుతో తమిళ ప్రజలకు మోసం'

కొళత్తూర్‌లో స్టాలిన్‌ vs ఆది రాజారాం..

ఎంకే స్టాలిన్, రాజారాం

కరుణానిధి మరణం తర్వాత.. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఎంకే స్టాలిన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన కొళత్తూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి రెండుసార్లు గెలిచిన స్టాలిన్‌, హ్యాట్రిక్‌ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి కొళత్తూర్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని చెబుతోన్న స్టాలిన్‌.. ఈసారి కూడా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో (2016) అన్నాడీఎంకే ప్రత్యర్థిపై 37 వేల ఓట్ల మెజారిటీతో స్టాలిన్‌ విజయం సాధించారు. అంతకుముందు 2011 ఎన్నికల్లో మాత్రం కేవలం 2 వేల ఓట్ల మార్జిన్‌తో మాత్రమే స్టాలిన్‌ గెలుపొందారు. ప్రస్తుతం అన్నాడీఎంకే సీనియర్‌ నేత ఆది రాజారాం బరిలో ఉండడం వల్ల అక్కడ పోటాపోటీ నెలకొంది. అయితే, తాము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి నియోజకవర్గం అని పేరున్న కొళత్తూర్‌ను మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్టాలిన్‌ అక్కడి ప్రజలకు హామీ ఇస్తున్నారు.

తాత కోట నుంచి ఉదయనిధి స్టాలిన్‌..

ఉదయనిధి స్టాలిన్‌

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనువడు, ఎంకే స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఒకప్పుడు తాత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెపాక్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉదయనిధి స్టాలిన్‌ మూడేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికీ.. ఇప్పటివరకు ఆయన డీఎంకే యూత్‌ వింగ్‌ సెక్రటరీగా ఉన్నారు. అయితే అరంగేట్రంలోనే కీలక చెపాక్‌‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండడం వల్ల ఈ నియోజకవర్గం మరోసారి ఆసక్తిగా మారింది. డీఎంకేకు కంచుకోటగా ఉన్న చెపాక్‌ స్థానం నుంచి కరుణానిధి మూడు సార్లు పోటీ చేసి విజయం సాధించారు. ఇందులో రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రి కావడం కారణంగా ఈ స్థానాన్ని కరుణానిధి కుటుంబం అదృష్టంగా భావిస్తోంది. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిపై దాదాపు 14వేల ఓట్ల మెజారిటీతో డీఎంకే విజయం సాధించింది. ఈసారి కూడా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉదయ నిధి స్టాలిన్‌ ధీమాతో ఉన్నారు.

ఇదీ చూడండి: తమిళ పోరు: పార్టీల నోట 'మద్య నిషేధం' మాట

కమల్‌హాసన్‌ vs శ్రీనివాసన్‌

కమల్ హాసన్

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగడం వల్ల తమిళనాడులో మరో కీలక నియోజక వర్గం కోయంబత్తూర్‌ దక్షిణపై అందరి దృష్టి మళ్లింది. కమల్‌ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తుండగా అన్నాడీఎంకే కూటమి నుంచి వానతి శ్రీనివాసన్‌ (భాజపా) బరిలో ఉన్నారు. ఇక ఇదే స్థానంలో డీఎంకే కూటమి అభ్యర్థి మయూరా జయకుమార్‌ కూడా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొలుత కమల్‌ చెన్నైలోని మైలాపూర్‌ నుంచి పోటీచేయాలని భావించిన్నప్పటీకి చివరకు కోయంబత్తూర్‌వైపే మొగ్గుచూపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థి దాదాపు లక్షన్నర ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. కోయంబత్తూర్‌ దక్షిణం నియోజకవర్గంలోనే 23 వేల ఓట్లు లభించాయి. దీంతో కమల్‌ ఈ స్థానాన్నే ఎంచుకొన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో ఏర్పడిన కోయంబత్తూర్‌ దక్షిణంలో ఇప్పటివరకు రెండు సార్లు ఎన్నికలు జరగ్గా.. రెండు ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే అభ్యర్థే విజయం సాధించారు. దీంతో ఈసారి కమల్‌ హాసన్‌కు అన్నాడీఎంకే మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది.

ఒంటరిగానే దినకరన్‌ పోరు..

టీటీవీ దినకరన్‌

అన్నాడీఎంకే బహిష్కృత నేత, శశికళ అల్లుడు టీటీవీ దినకరన్‌ అమ్మా మక్కల్‌ మున్నెట్ర కజగం (ఏఎంఎంకే) తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. గతంలో జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నై ఆర్‌ఆర్‌ నగర్‌ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి మాత్రం సొంతపార్టీ ఏఎంఎంకే తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే, ప్రస్తుతం దినకరన్‌ ఆర్‌ఆర్‌ నగర్‌ నుంచి కాకుండా అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రి (కె రాజు) అసెంబ్లీ స్థానం కోవిల్‌పట్టీ నుంచి పోటికి దిగారు. ఈ స్థానంలో డీఎంకే కూటమి నుంచి కె.శ్రీనివాసన్‌ పోటీ ఇవ్వనున్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ కనిపిస్తోంది. అయితే, రాజకీయాల నుంచి దూరంగా ఉంటానంటూ శశికళ ప్రకటించడం వల్ల ఈ ఎన్నికల్లో గెలుపుకోసం టీటీవీ దినకరన్‌ ఒంటరిగానే శ్రమిస్తున్నారు. ఈ మధ్యే అన్నాడీఎంకే నేతల పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ నేత బాబు మురుగయన్‌ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దినకరన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది.

ఇదీ చూడండి: 'తమిళ ప్రజలు విశాల హృదయులు'

Last Updated : Apr 3, 2021, 6:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.