తమిళనాడు సేలం జిల్లాలో ఘోర విషాద ఘటన జరిగింది. సిలిండర్ పేలి ఐదుగురు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మూడు భవనాలు..
సేలం జిల్లాలోని(Tamil nadu salem news) కరుంకల్ పట్టి ప్రాంతంలోని ఓ వ్యక్తి ఇంట్లో మంగళవారం ఉదయం 6:30 గంటలకు పెద్ద శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఆ ప్రాంతంలోని మూడు భవనాలు నేలకూలాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు.
ఓ ఐదేళ్ల బాలిక సహా శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. వారికి తీవ్రగాయాలు కాగా.. సేలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ఘటనాస్థలికి సేలం జిల్లా కలెక్టర్ కార్మేఘమ్, పోలీసు ఉన్నతాధికారులు చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్)తో పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న మిగతావారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: ఘోర ప్రమాదం- ఒకే కుటుంబంలోని ఐదుగురు దుర్మరణం
ఇదీ చూడండి: స్కూల్ బస్సు మిస్ అయిందని.. విద్యార్థి ఆత్మహత్య!