దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కొత్తగా 21,410 కేసులు నమోదయ్యాయి. 443 మంది ప్రాణాలు కోల్పోయారు. 32,472 మంది డిశ్చార్జ్ అయ్యారు.
దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 414 కేసులు వెలుగులోకి వచ్చాయి. 60 మంది మరణించారు.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
- మహారాష్ట్రలో 13,659 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 300 మంది చనిపోయారు.
- కేరళలో 17,328 కేసులు నమోదయ్యాయి. 209 మంది మృతి చెందారు.
- కర్ణాటకలో 13,800 కేసులు బయటపడ్డాయి. 365 మంది మరణించారు.
- గుజరాత్లో 996 కేసులు బయటపడ్డాయి. 15 మంది వైరస్ ధాటికి బలయ్యారు.
- ఉత్తర్ప్రదేశ్లో కొత్తగా 1,092 మందికి కరోనా సోకగా.. మరో 120 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
- మధ్యప్రదేశ్లో కొత్తగా 718 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 38 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: చర్మంపై మాస్క్, శానిటైజర్ల దాడి..!
ఇదీ చూడండి: అన్లాక్పై రాష్ట్రాల దృష్టి- అక్కడ ఐదంచెల వ్యూహం!