దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కొత్తగా 19,448 కేసులు నమోదయ్యాయి. 351 మంది ప్రాణాలు కోల్పోయారు. 31,360 మంది డిశ్చార్జ్ అయ్యారు.
దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 231 కేసులు వెలుగులోకి వచ్చాయి. 36 మంది మరణించారు.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
- మహారాష్ట్రలో 10,219 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 154 మంది చనిపోయారు.
- కేరళలో 9,313 కేసులు నమోదయ్యాయి. 221 మంది మృతి చెందారు.
- కర్ణాటకలో 11,958 కేసులు బయటపడ్డాయి. 340 మంది మరణించారు.
- గుజరాత్లో 778 కేసులు వెలుగు చూశాయి. 11 మంది వైరస్ ధాటికి మృతి చెందారు.
- మధ్యప్రదేశ్లో కొత్తగా 5,587 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 103 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
- బంగాల్లో 848 కేసులు బయటపడ్డాయి. 12 మంది వైరస్ ధాటికి బలయ్యారు.
ఇదీ చూడండి: 'జూన్ 21 నుంచి అందరికీ ఉచితంగా టీకా'
ఇదీ చూడండి: కేంద్రం కరోనా లెక్కలపై ప్రియాంక అనుమానాలు