ETV Bharat / bharat

మంత్రి కుమార్తె ప్రేమ వివాహం.. పోలీసుల్ని ఆశ్రయించిన జంట! - మంత్రి కూతురు ప్రేమ వివాహం

Minister daughter marriage: మంత్రి అయిన తన తండ్రి నుంచి తమకు ప్రాణహాని ఉందని బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు తమిళనాడు మంత్రి శేఖర్​బాబు కుమార్తె. తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పినట్లు తెలిపారు.

Tamil Nadu Minister's daughter
సతీశ్​ను పెళ్లి చేసుకున్న జయ కళ్యాణి
author img

By

Published : Mar 7, 2022, 8:46 PM IST

Minister daughter marriage: తన తండ్రి నుంచి తమకు ప్రాణ హాని ఉందని తమిళనాడు మంత్రి శేఖర్​బాబు కుమార్తె జయకళ్యాణి ఆరోపించారు. తన ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పినట్లు పేర్కొంది. తమకు రక్షణ కల్పించాలని బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు.

Tamil Nadu Minister's daughter
సతీశ్​ను పెళ్లి చేసుకున్న జయ కళ్యాణి

సోమవారం బెంగళూరులో సతీశ్​ అనే యువకుడితో మంత్రి కుమార్తె వివాహం జరిగింది. అనంతరం దంపతులు పోలీసులను ఆశ్రయించారు. సిటీ కమిషన్​ కార్యాలయానికి వెళ్లి.. తన తండ్రి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మంత్రి శేఖర్​ బాబు అత్యంత సన్నిహితుడు.

"నేను ఈ రోజు సతీశ్​ను పెళ్లి చేసుకున్నాను. మాది ప్రేమ వివాహం. మా ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు. కొన్ని నెలల క్రితం నన్ను పెళ్లి చేసుకుంటానని సతీశ్ ముందుకు వచ్చారు. అయితే తమిళనాడు పోలీసులు ఆయన్ను రెండు నెలల పాటు అక్రమంగా నిర్బంధించారు. ఇప్పుడు మేము మేజర్లం. ఈ పెళ్లి మా ఇద్దరి సమ్మతి మీదనే జరిగింది. తమిళనాడులో అడుగుపెడితే చంపేస్తామని మా తల్లిదండ్రులు బెదిరించారు. కాబట్టి మాకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నాను."

- జయ కళ్యాణి, మంత్రి శేఖర్​ బాబు కుమార్తె

జయ కళ్యాణి, సతీశ్​లు హిందూ సంప్రదాయం ప్రకారం బెంగళూరులోని ఓ హిందూ ధార్మిక సంస్థలో వివాహం చేసుకున్నారు.

ఇదీ చూడండి: అందుకు ఒప్పుకోలేదని కన్న కూతుర్ని కడతేర్చిన తండ్రి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.