తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితిపై చైనాతో మరోసారి కమాండర్ స్థాయి చర్చలు జరపటంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని భారత వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ భదౌరియా తెలిపారు. తెలంగాణ హైదరాబాద్ దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తూర్పు లద్దాఖ్‌లో ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడారు.
"చైనాతో మరో విడత చర్చల కోసం సిద్ధంగా ఉన్నాం. కమాండర్ స్థాయి సమావేశాల జరిపే ప్రతిపాదన ఉంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సరిహద్దులో పరిస్థితులపై క్షేత్రస్థాయిలో భారత దళాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి."
-ఆర్కేఎస్ భదౌరియా, ఐఏఎఫ్ చీఫ్ మార్షల్
ఆధునాతన సాంకేతికతలను ఐఏఎఫ్ వినియోగించుకుంటోందని భదౌరియా తెలిపారు. 2022 నాటికి భారత వైమానిక దళ అమ్ముల పొదిలో 36 రఫేల్ యుద్ధ విమానాలు తప్పక చేరుతాయని స్పష్టం చేశారు.
"2022 వరకు రఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు రావాల్సి ఉంది. ఈ లక్ష్యంలో ఏ మార్పూ లేదు. కొవిడ్ వల్ల ఒకటి రెండు విమానాలు ఆలస్యమవుతాయి కావచ్చు. కానీ, ఇప్పటివరకు ఫ్రాన్స్ నుంచి కొన్ని విమానాలు నిర్దేశిత సమయం కంటే ముందే వచ్చాయి."
-ఆర్కేఎస్ భదౌరియా, ఐఏఎఫ్ చీఫ్ మార్షల్
రూ.59,000 కోట్లుతో 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్రాన్స్ నుంచి ఆరో బ్యాచ్ రఫేల్ యుద్ధ విమానాలను గత నెలలోనే భారత్‌కు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆరో బ్యాచ్ రాకతో మూడింట రెండొంతుల రఫేల్ విమానాలు భారత్ చేరుకున్నట్లు ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: 'ఏకపక్ష చర్యను ఎట్టి పరిస్థితుల్లో సహించం'
ఇదీ చూడండి: Galwan Clash: భారత్ నేర్వాల్సిన పాఠాలు!