సాధారణ జీవనం గడిపే ఓ స్వీపర్‌కు రూ.16 కోట్ల రుణం చెల్లించమని ఓ బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే, నోటీసులు ఇచ్చిన బ్యాంక్‌లో తనకు ఖాతానే లేదని ఆ స్వీపర్ చెబుతున్నాడు. బ్యాంక్ అధికారులు పంపిన ఈ నోటీసుతో.. స్వీపర్ కుటుంబం అవ్వాకైంది. అతని భార్య భయంతో అనారోగ్యం పాలై.. ఆసుపత్రిలో చేరింది. ఈ ఘటన గుజరాత్లో జరిగింది.
వడోదర నగరానికి చెందిన శాంతిలాల్ అనే వ్యక్తి తన భార్య జాషిబెన్‌తో కలిసి రాజ్యలక్ష్మి సొసైటీలో నివాసం ఉంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖకు మీరు అప్పు ఉన్నారని, మార్చి 4వ తేది లోపు వాటిని చెల్లించాలని నోటీసులు పంపించారు అధికారులు. లోన్ చెల్లించనట్లయితే.. ఆస్తులను స్వాధీనం చేసుకుంటామనే హెచ్చరిక సైతం అందులో ఉంది. దీంతో శాంతిలాల్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. అతని భార్య సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు.
అనంతరం శాంతిలాల్ కుటుంబం వడోదర నగర కార్యాలయానికి వెళ్లి.. పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసింది. అయినా ఎటుంటి లాభం లేకపోయింది. అధికారులు శాంతిలాల్‌కు ఎటువంటి సమాచారం అందించలేదు. అనంతరం శాంతిలాల్.. స్థానిక ఎమ్మెల్యే నీరజ్ చోప్రాను ఆశ్రయించారు. ఎమ్మెల్యే చోప్రా బాధితుల తరఫున జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. వారికి న్యాయం చేయాలని అధికారులను కోరారు.
శాంతిలాల్ కుటుంబం మొత్తం ఆస్తులే రూ.5 నుంచి 10 లక్షలు ఉంటాయన్న నీరజ్ చోప్రా.. అలాంటి వారు రూ. 16 కోట్లు ఎలా అప్పు చేస్తారని అధికారులను ప్రశ్నించారు. ఇదొక ఫేక్ నోటీసని అన్నారు. దీని వల్ల శాంతిలాల్ కుటుంబం ఆసుపత్రి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నోటీస్‌పై విచారణ జరిపించాలని అధికారులను డిమాండ్ చేశారు. "నేను ఒక స్వీపర్‌ని. నాకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఎటువంటి ఖాతా లేదు. నేను ఎక్కడా లోన్ కూడా తీసుకోలేదు. నాకు కేవలం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రమే ఖాతా ఉంది." అని శాంతిలాల్ తెలిపారు.
మూడేళ్లి క్రితం మరణించిన వ్యక్తికి లోన్
మూడేళ్ల క్రితం మరణించిన వ్యక్తికి లోన్ మంజూరు చేశారు బ్యాంక్ అధికారులు. తాజాగా లోన్ తిరిగి చెల్లించడం లేదంటూ మృతుడి కుటుంబ సభ్యులకు నోటీసులు అందించారు. అయితే, తమకు బ్యాంక్ నుంచి ఎలాంటి రుణం అందలేదని మృతుడి కుమారుడు వాపోతున్నాడు. మధ్యప్రదేశ్ ఛింద్వాఢలో వింత ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవీ చదవండి : భింద్రన్‌వాలే స్వగ్రామంలోనే అమృత్‌పాల్ అరెస్ట్.. పోలీసులు పట్టుకున్నారా?.. లొంగిపోయాడా?
కర్ణాటక ఎన్నికలు.. 502 మంది అభ్యర్థుల నామినేషన్లు రిజెక్ట్.. పోటీలో ఎంతమందంటే?