బంగాల్లో 77 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన భాజపాకు.. అసెంబ్లీలో సువేందు అధికారి సారథ్యం వహించనున్నారు.
ప్రతిపక్ష నేత రేసులో పార్టీలో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ నందిగ్రామ్‌లో దీదీని ఓడించిన సువేందు వైపే భాజపా అధిష్ఠానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో భాజపా బంగాల్ విభాగం సువేందు పేరును అధిరారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: దిల్లీలో మరోవారం పాటు లాక్డౌన్ పొడిగింపు