ETV Bharat / bharat

అంబానీ ఇంటి వద్ద 'బాంబుల కారు' కేసులో ట్విస్ట్! - near Ambani house bomb car case latest news

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్ అంబానీ నివాసానికి దగ్గరలో పేలుడు పదార్థాలతో కలకలం సృష్టించిన కారు.. కొంత కాలం క్రితం చోరీకి గురైందని అధికారులు వెల్లడించారు. కారు అసలు యజమానిని గుర్తించినట్లు పేర్కొన్న అధికారులు.. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

SUV with explosives found near Ambani's house turns out to be stolen
అంబానీ ఇంటికి సమీపంలో కారు ఘటనలో కొత్త మలుపు
author img

By

Published : Feb 26, 2021, 7:04 PM IST

Updated : Feb 27, 2021, 6:13 AM IST

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాలతో కలకలం రేపిన కారు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆ కారు కొంతకాలం క్రితం చోరీకి గురైందని అధికారులు తెలిపారు. ఆ కారు అసలు యజమాని హిరెన్​ మన్​సుఖ్​.. వారం క్రితం దీనిపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. గురువారం.. అంబానీ ఇంటికి దగ్గర్లో పార్కు​ చేసి ఉన్న కారు దృశ్యాలు చూసిన తర్వాత మన్​సుఖ్​.. పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చారని అధికారులు వెల్లడించారు.

కారు ఎలా పోయింది?

ఠాణె జిల్లాకు చెందిన మాన్​సుఖ్​.. ఫిబ్రవరి 17న ఓ వేడుకకు వెళ్తుండగా కారు చెడిపోవడం వల్ల ఐరోలీ ములుండ్​ బ్రిడ్జ్​ సమీపంలో పార్కు చేశారు. తర్వాత రోజు కారును తెచ్చుకోవడానికి వెళ్లగా.. అక్కడ లేదు. నాలుగు గంటలు పాటు వెతికిన తర్వాత కారు పోయినట్లు గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశానని మన్​సుఖ్​ తెలిపారు.

ఎఫ్​ఐఆర్​ నమోదు..

అంబానీ నివాసం దగ్గర్లో పేలుడు పదార్థాల కారు పార్కింగ్ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా.. ఈ ఘటనతో సంబంధం ఉన్న గుర్తుతెలియని కొందరి వ్యక్తులపై గామ్​దేవి పోలీసు స్టేషన్​లో ఎఫ్​ఐఆర్​ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఆ కారులో ఓ లేఖ కూడా లభించినట్లు తెలిపారు. "ఇది చిన్న ఝలక్​ మాత్రమే. వచ్చేసారి సామాను(బాంబులు) పేలేలా పెడతాము)" అని రాసి ఉన్నట్టు తెలిసింది.

ఇదీ చూడండి: ముకేశ్​ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

Last Updated : Feb 27, 2021, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.