ETV Bharat / bharat

'ఖలిస్థాన్​ ట్వీట్​'పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

కేంద్రం సహా 8 రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వివాదస్పద ఖలిస్థాన్ ట్వీట్​పై దాఖలైన వివిధ ఎఫ్​ఐఆర్​లకు సంబంధించి ట్విట్టర్ సుప్రీంను ఆశ్రయించింది. ఫిర్యాదుదారులు వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది.

supreme sends notice to state and central, 8 states, multiple firs on twitter
వివరణ ఇవ్వండి
author img

By

Published : Dec 18, 2020, 7:07 AM IST

వివాదస్పద ఖలిస్థాన్ ట్వీట్​పై నమోదైన ఎఫ్​ఐఆర్​లపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఈ జాబితాలో కేంద్ర హోంశాఖ సహా కర్ణాటక, అసోం, హరియాణా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, దిల్లీ ఉన్నాయి.

ట్విట్టర్ వినతి..

ఒకే అంశంపై దాఖలైన వివిధ ఎఫ్​ఐఆర్​లను ఉపసంహరించుకోవాలని ట్విట్టర్.. సుప్రీంను కోరింది. ఎఫ్ఐఆర్​లు అన్నింటినీ ఒకే ఫిర్యాదు కింద పరిగణించి విచారణ జరపాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బోబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఫిర్యాదు దారులు కూడా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఖలిస్థాన్ ట్వీట్​పై ట్విట్టర్​కు ముడుపులు అందాయని ఆరోపించిన భాజపా నేత వినీత్ గోయెంకాకు కూడా నోటీసులు జారీ చేసింది.

ఇదీ చూడండి : దుష్ప్రచారాలు నమ్మొద్దు: రైతులకు తోమర్​ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.