ETV Bharat / bharat

పెద్దనోట్ల రద్దును సవాల్‌ చేస్తూ సుప్రీంలో 58 పిటిషన్లు​.. సోమవారమే తీర్పు

కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు ఇవ్వనుంది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించనుంది.

supreme-court-will-give-verdict-of-challenging-demonetisation-on-monday
పెద్దనోట్ల రద్దును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్​.. రేపే తీర్పు
author img

By

Published : Jan 1, 2023, 6:18 PM IST

2016లో కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్​ నజీర్‌ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించనుంది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ గవాజ్‌, జస్టిస్‌ నాగరత్న, జస్టిస్‌ ఏస్​బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ సభ్యులుగా ఉన్నాయి. పెద్దనోట్ల రద్దుకు సంబంధించిన రికార్డ్‌ సమర్పించాలని కేంద్రప్రభుత్వం తోపాటు ఆర్​బీఐని డిసెంబర్‌ 7న ఆదేశించిన సుప్రీంకోర్టు తీర్పును సోమవారానికి వాయిదావేసింది.

కాగా, 2016 నవంబర్ 8న కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం నిర్ణయం చెల్లుబాటును సవాల్ చేస్తూ 58 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. 2016 డిసెంబర్ 16న అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్.. ఈ వ్యాజ్యాల విచారణను ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేశారు. దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. సవివర అఫిడవిట్ సమర్పించాలని అక్టోబర్ 11న కేంద్రం, ఆర్​బీఐకి నోటీసులు జారీ చేసింది. నోట్ల రద్దు సమయంలో ఆర్​బీఐకి కేంద్రం రాసిన లేఖలు, ఆర్​బీఐ బోర్డు నిర్ణయాలు, నోట్ల రద్దు ప్రకటనలకు సంబంధించిన ఫైళ్లను సమర్పించాలని ఆదేశించింది. శీతాకాల సెలవుల తర్వాత.. సుప్రీంకోర్టు కార్యకలాపాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.