Bipolar man as Judge: 'బైపోలార్ మ్యాన్ (భిన్న ప్రవృత్తులు విపరీతంగా గల మానసిక రోగి) భవ్య నైన్‌కు న్యాయాధికారిగా బాధ్యతలు అప్పగించడంలో మాకెలాంటి ఇబ్బంది కనిపించడం లేదు. కాబట్టి, దిల్లీలోని ఓ జిల్లా కోర్టు జడ్జిగా ఆయన్ను తక్షణం నియమించండి' అంటూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
Bipolar man symptoms: 11 ఏళ్ల క్రితం.. పాతికేళ్ల వయసున్న భవ్య నైన్‌కు బైపోలార్ డిజార్డర్ రుగ్మత ఉన్నట్లు బయటపడింది. ఈ వ్యాధి ఉన్నవాళ్లు సంతోషం కలిగినా, ఆవేదనకు గురైనా విపరీతమైన భావావేశం ప్రదర్శిస్తారు. 'పర్సన్ విత్ డిజేబిలిటీ' కోటాలో దిల్లీ జుడీషియల్ సర్వీస్-2018 పరీక్ష పాసైన భవ్య నైన్‌కు ఉద్యోగ నియామకం విషయంలో ఆటంకం ఎదురైంది. మానసిక అనారోగ్యంతో న్యాయాధికారిగా బాధ్యతల నిర్వహణ సక్రమంగా చేయలేరన్న వాదనను సమర్థిస్తూ 2019 మేలో ఆయన అభ్యర్థిత్వాన్ని దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అప్పటి నుంచీ న్యాయపోరాటం చేస్తున్న నైన్ చివరకు విజయం సాధించారు.
ఇదీ చూడండి: 'జైల్లో వేయడానికి చట్టాన్ని వాడుకోకండి'