ETV Bharat / bharat

Supreme court on Vanama Petition : సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరరావుకు ఊరట.. హైకోర్టు తీర్పుపై స్టే - వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు తీర్పు

Supreme court on MLA Vanama Petition
Supreme court on MLA Vanama Petition
author img

By

Published : Aug 7, 2023, 1:54 PM IST

Updated : Aug 7, 2023, 7:38 PM IST

13:49 August 07

Supreme court on Vanama Petition : సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరరావుకు ఊరట.. హైకోర్టు తీర్పుపై స్టే

Supreme court on Vanama Petition : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వనమా అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో వనమా వెంకటేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చారని.. ఆయన్ను అనర్హుడిగా ప్రకటించమని కోరుతూ జలగం వెంకటరావు గతంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

High Court verdict on Vanama Venkateswara Rao : అనేక వాదనల అనంతరం గత నెల 25న వనమాను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా తీసుకోవాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తీర్పుపై స్టే కోరుతూ తొలుత హైకోర్టునే వనమా ఆశ్రయించగా.. న్యాయస్థానం నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. 2018 సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా పోటీ చేయగా.. బీఆర్​ఎస్​ అభ్యర్థి జలగం వెంకటరావుపై 4 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. అనంతరం బీఆర్​ఎస్​లో చేరారు.

Vanama controversy : వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురు

Kothagudem MLA Election On HC : వనమా VS జలగం.. కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు..?

Vanama Venkateswara Rao Election Controversy : వనమా వెంకటేశ్వరావు ఎన్నికపై హైకోర్టు తీర్పు అనంతరం అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన తర్వాత రెండో స్థానంలో ఉన్న జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దీంతో వెంకటరావు అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శిని సైతం కలిసి తనతో కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు. వనమా మాత్రం.. తీర్పును సవాల్ చేస్తూ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టుకు వెళ్లడం కోసం తీర్పును తాత్కాలికంగా నిలిపివేయాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్​ను కొట్టి వేసింది. వనమా ఎన్నిక చెల్లదన్న తీర్పును నిలిపి వేసేందుకు హైకోర్టు నిరాకరించింది.

ఖమ్మంలో మారుతున్న రాజకీయాలు: రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా చాలా కీలకమైంది. ఎందుకంటే ఇక్కడ అన్ని వర్గాల వారు సమానంగా ఉంటారు. అంతే కాకుండా మొదటి నుంచి కమ్యూనిస్టుల ప్రభావం జిల్లా రాజకీయాల్లో బలంగా ఉంది. అలాగే మరో తెలుగు రాష్ట్రానికి సరిహద్దు కావడంతో అక్కడి నాయకుల ప్రభావం కొంత మేర ఉంటుంది. తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్​లోకి వెళ్లడంతో ఆ పార్టీ కొంత బలపడిందనే చెప్పొచ్చు. అలాగే కొత్తగూడెం ఎమ్మెల్యే వివాదంలో వనమా, జలగం వెంకటరావు ఇద్దరూ ఒకే పార్టీ వారు కావడంతో బీఆర్ఎస్​కు ఇది కొంత మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

Kothagudem MLA Controversy On HC : 'కొత్తగూడెం ఎమ్మెల్యేగా నాతో ప్రమాణ స్వీకారం చేయించాలి'

BRS MLA Vanama Venkateswara Rao : వనమా ఎన్నిక రద్దు.. ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించిన హైకోర్టు

Last Updated : Aug 7, 2023, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.