ETV Bharat / bharat

'అలాంటి కేసుల్లో తక్షణమే విడాకులు'.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

భార్యాభర్తల విడాకుల మంజూరు అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరూ కలిసి జీవించలేని పరిస్థితి ఉంటే వెంటనే విడాకులు ఇవ్వొచ్చని పేర్కొంది. పరస్పర అంగీకారంతో దంపతులు విడిపోవాలనుకుంటే దాని కోసం ఆరు నెలలు నిరీక్షించాల్సిన పనిలేదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అంగీకరిస్తే వెంటనే విడాకులు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది.

Supreme Court Latest News On Marriage Divorce
భార్యాభర్తల విడాకుల మంజూరు అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
author img

By

Published : May 1, 2023, 12:09 PM IST

Updated : May 1, 2023, 12:47 PM IST

దంపతుల వివాహాల రద్దు అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. విడాకులు కోసం ఆరు నెలల నిరీక్షణ నిబంధనను సుప్రీంకోర్టు సడలించింది. కలిసి బతకలేని స్థితిలో ఉంటే ఆ దంపతులు విడాకుల కోసం ఆరు నెలలు ఎదురు చూడాల్సిన అవసరం లేదని.. భార్యాభర్తల పరస్పర అంగీకారం ఉంటే వెంటనే విడాకులు మంజూరు చేయొచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యనించింది. వివాహ బంధంలో ఉండలేని పరిస్థితుల్లో విడాకులు తీసుకోవచ్చనని జస్టిస్‌ సంజయ్ కిషన్ కౌల్ కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. పిల్లల హక్కు, భరణం, ఇల్లు నిర్వహణలకు సంబంధించి ఈక్విటీలను ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా బెంచ్ వివరించింది.

ఈ మేరకు తమకు విశిష్ట అధికారాలు ఉన్నాయని జస్టిస్‌ ఎస్‌.కే. కౌల్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గుర్తు చేసింది. దంపతుల మధ్య వివాహ బంధం కోలుకోలేని విధంగా విచ్ఛినమైతే ఆ కారణం కింద వారి పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడం ఈ కోర్టుకు సాధ్యమేనన్న సుప్రీంకోర్టు ఆర్టికల్‌ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగించుకుని సర్వోన్నత న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేయొచ్చని వ్యాఖ్యానించింది. విడాకులు కోరే జంట నడుమ కోలుకోలేని విభేధాలు, సమస్యలు పరిష్కారం కానీ స్థితి తలెత్తినప్పుడు కలిసి జీవించలేని స్థితి నెలకొంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ వివాహాన్ని వెంటనే రద్దు చేసే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద తమకు ఉంటుందని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. కుటుంబ న్యాయస్థానాలకు రిఫర్‌ చేయకుండానే సుప్రీంకోర్టు నేరుగా విడాకులు మంజూరు చేసే అంశంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

పరస్పరం ఇష్టపూర్వకంగా విడాకులు కోరుకునే వారి విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 పరిధిలోని విస్తృత అధికారాలను వినియోగించుకునే వీలుందా అనే అంశంపై జస్టిస్‌ ఎస్‌.కే. కౌల్‌ జస్టిస్‌ సంజీవ్ ఖన్నా.. జస్టిస్‌ ఎ.ఎస్. ఓకా, జస్టిస్‌ విక్రమ్ నాథ్ జస్టిస్‌ జె.కె. మహేశ్వరిలతో కూడిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఐదేళ్ల క్రితం 2016 జూన్‌ 29న ఈ పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. ఈ పిటిషన్లపై కొన్నేళ్ల పాటు విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. గతేడాది సెప్టెంబరులో తీర్పు రిజర్వ్‌ చేసింది. తాజాగా సోమవారం తీర్పు వెలువరించింది.

Last Updated : May 1, 2023, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.