Criminal state of mind: శిక్షలు విధించే ముందు నేరం తీవ్రతతో పాటు, నేరస్థుడి మానసిక స్థితినీ, అతని సాంఘిక-అర్థిక పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకోవడం న్యాయస్థానాల విధి అని సుప్రీంకోర్టు తెలిపింది. నేరస్థుడిని ఎంతవరకు సంస్కరించవచ్చో కూడా పరిశీలన జరపాలని పేర్కొంది. కింది కోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చుతూ జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
Supreme court on criminal: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ముద్దాయి ఆస్తి తగాదాలో ఇద్దరు అన్నదమ్ములు, వారి కుమారుడిని హత్య చేశాడు. తీవ్రమైన నేరం కావడం వల్ల కిందికోర్టు మరణశిక్ష విధించింది. దీనిని 80 ఏళ్ల యావజ్జీవిత శిక్షగా తగ్గిస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. "నిందితుడిది గ్రామీణ ప్రాంతం. ఆర్థికంగా పేద పరిస్థితి. అంతకుముందు ఎలాంటి నేరాలు చేసిన చరిత్ర లేదు. కరుడుగట్టిన నేరస్థుడేమీ కాదు. అతడు చేసినది క్రూరమైన నేరమే. కానీ జైలులో ఉన్నప్పుడు అతని ప్రవర్తన సంతృప్తికరంగా ఉందని సూపరిండెంట్ నివేదిక ఇచ్చారు. అతడిలో పరివర్తన రాదు అని పేర్కొంటూ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. అందువల్ల శిక్ష తీవ్రతను తగ్గిస్తున్నాం" అని పేర్కొంది.
ఇదీ చూడండి: రైతులపై కేసులు.. ఉపసంహరణ నిర్ణయం ఆ రాష్ట్రాలదే!
ఇదీ చూడండి: చైనా సరిహద్దుల్లో 59 గ్రామాలు ఖాళీ.. ఏం జరుగుతోంది?