Superstar Krishna Statue Inauguration: తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికి గుర్తుండిపోయే పేరు సూపర్ స్టార్ కృష్ణ.. సినీ పరిశ్రమలో తాను నటించిన చిత్రాలలో విచిత్రమైన పాత్రలు వేసి తనకైన ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. విభిన్నమైన పాత్రలతో అలరించి ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేశారు. ఘట్టమనేని శివరామకృష్ణగా మొదలు పెట్టి సూపర్ స్టార్‌గా ఎదిగిన ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల ఆదర్శంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి వెండితెరపై తనదైన ముద్ర వేశారు. ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా.. తాను పుట్టిన ఊరిమీద మాత్రం మమకారం మరువలేదు.
సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత తొలిసారిగా మహేశ్ ఎమోషనల్ పోస్ట్
తండ్రి బాటలోనే తనయుడు.. సూపర్ స్టార్ కృష్ణ గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. సూపర్ స్టార్‌గా కృష్ణ ఎంత ఎత్తుకు ఎదిగినా సొంతూరును మాత్రం మరువలేదు. గ్రామ అభివృద్ధికి తనకు సాధ్యమైనంత వరకు కృషి చేశారు. తన తల్లి పేరిట ఏర్పాటు చేసిన పాఠశాలకు సహకరం అందించారు. 12 లక్షల రూపాయల ఖర్చితో అక్కడ గీతా మందిరం నిర్మించారు. తండ్రి బాటలోనే ఆయన తనయుడు, నటుడు మహేష్‌బాబు నడుస్తున్నాడు. బుర్రిపాలెంను దత్తత తీసుకుని పలు రకాల అభివృద్ధి పనులు గ్రామంలో చేపట్టారు. తరచగా అక్కడ క్యాంపులు నిర్వహిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. నేడు కృష్ణ స్వగ్రామంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు.
కృష్ణ విగ్రహావిష్కరణ.. పేరు చిరకాలం గుర్తుండిపోయేలా రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కుమార్తెలు మంజుల, పద్మావతి, ప్రియదర్శిని, అల్లుడు సుధీర్ బాబు తదితరులు ఆవిష్కరించారు. కృష్ణ జ్ఞాపకాల్ని గ్రామంలో పదిలంగా నిలుపుతామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నాన్నగారికి బుర్రిపాలెం అంటే ఎంతో అభిమానమని, ఆయన ఆశయాల్ని సాధించేలా ముందుకు వెళ్తామని కుమార్తెలు తెలిపారు. మహేష్ బాబు రాలేకపోయారని, మరోసారి వస్తానని తెలిపారన్న కుటుంబసభ్యులు.. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇక ముందు కూడా కొనసాగిస్తామని చెప్పారు.
Superstar Krishna: సాహసాల మొనగాడు.. తేనె మనసు 'బుర్రిపాలెం' బుల్లోడు
దేవుడు లాంటి మనిషి పుస్తకం ఆవిష్కరం.. కృష్ణతో నెంబర్ వన్ లాంటి సూపర్ హిట్ సినిమా చేసే అదృష్టం దక్కిందన్న ఎస్వీ కృష్ణారెడ్డి.. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన నెంబర్ వన్‌గా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్యే శివకుమార్, టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర, నన్నపనేని రాజకుమారి తదితరులు హాజరై.. కృష్ణకు నివాళుర్పించారు. ఈ వేదికపైనే సూపర్ స్టార్ కృష్ణ మీద ప్రముఖ సినీ రచయిత వినాయకరావు రాసిన దేవుడు లాంటి మనిషి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కృష్ణ, మహేష్ బాబును అనుకరిస్తూ జూనియర్ నటులు చేసిన నృత్యాలు గ్రామస్తుల్ని, అభిమానుల్ని అలరించాయి.