ETV Bharat / bharat

బ్యాంకు ఖాతాలోకి రూ.6,833 కోట్లు.. అధికారుల మౌనం!.. ఇప్పటికీ అకౌంట్లోనే డబ్బు - వేల కోట్లు బ్యాంకు ఖాతా

ఓ వ్యక్తి ఖాతాలోకి రూ.6వేల కోట్లకు పైగా నగదు క్రెడిట్ అయింది. ఈ డబ్బు ఎలా వచ్చిందో? ఎవరు పంపించారో తెలీదు! వారం క్రితం డబ్బులు వచ్చినట్లు తెలుస్తుండగా.. ఇప్పటికీ నగదు ఆ ఖాతాలోనే ఉంది. అసలేమైంది?

68 billion 33 crore rupees Credited
68 billion 33 crore rupees Credited
author img

By

Published : Aug 8, 2022, 10:31 AM IST

బిహార్ లఖిసరాయ్​కి చెందిన ఓ వ్యక్తి ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. వందలు కాదు.. లక్షలు కాదు.. ఏకంగా వేల కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమా అయ్యాయి. బ్యాంకు ఖాతా తనిఖీ చేసుకోగానే విషయం ఈ బయటపడింది.

జిల్లాలోని బర్హియా గ్రామానికి చెందిన సుమన్ కుమార్​కు.. కోటక్ సెక్యూరిటీస్ మహీంద్రా బ్యాంకులో డీమాట్ ఖాతా ఉంది. అతడు స్టాక్ మార్కెట్​లో ట్రేడింగ్ చేస్తుంటాడు. వారం రోజుల క్రితం అతడి బ్యాంకు ఖాతాలోకి రూ.6,833.42 కోట్లు వచ్చి చేరాయి. ఇటీవల ఖాతా తనిఖీ చేసుకున్న సుమన్​కు విషయం తెలిసింది. అకౌంట్లో వేల కోట్ల రూపాయలు చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు సుమన్. అయితే, డబ్బులు ఎలా వచ్చాయో తెలియడం లేదు. ఇప్పటికీ డబ్బులు ఖాతాలోనే ఉన్నాయి.

"సుమన్.. ఇంట్లో నుంచే స్టాక్ మార్కెట్​కు సంబంధించిన ట్రేడింగ్ వర్క్ చేస్తాడు. ఈ క్రమంలోనే ఖాతాలో భారీగా నగదు జమా కావడాన్ని గమనించాడు. దీని గురించి తెలుసుకునేందుకు చాలా మందిని సంప్రదించాడు. తొలుత సాంకేతిక తప్పిదం అని భావించాం. కానీ, కస్టమర్ కేర్​కు కాల్ చేస్తే.. నిజంగానే డబ్బులు క్రెడిట్ అయినట్లు స్పష్టమైంది. సమాచార హక్కు కింద వివరాలు కోరాం. కానీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు."
-శ్రావణ్ కుమార్, సుమన్ కుటుంబ సభ్యుడు

దీనిపై తమకు పూర్తి సమాచారం అందలేదని సూర్యగఢ స్టేషన్ హౌస్ అధికారి చందన్ కుమార్ వెల్లడించారు. 'పట్నా నుంచి మాకు ఒకరు కాల్ చేసి ఈ విషయం గురించి చెప్పారు. కానీ, అధికారికంగా మాకు ఎలాంటి సమాచారం అందలేదు. బ్యాంకు అధికారులు ఈ విషయంపై మమ్మల్ని సంప్రదిస్తే ఏమైనా చెప్పగలం' అని వివరించారు. దీంతో ప్రస్తుతం వేల కోట్ల రూపాయలు ఖాతాలోనే ఉన్నాయి. పొరపాటున నగదు బదిలీ అయిందనుకున్నా.. దీనిపై ఇంతవరకు ఎవరూ పోలీసులను సంప్రదించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.