ETV Bharat / bharat

రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం- సడెన్ బ్రేక్​తో..

author img

By

Published : Dec 29, 2021, 5:13 PM IST

Suicide attempt on railway track: రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. ట్రైన్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల అతని ప్రాణాలు నిలిచాయి. మహిళా కానిస్టేబుళ్లు కూడా ఆ వ్యక్తిని కాపాడేందుకు పరుగులు తీశారు.

Suicide attempt on railway track, రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం
రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం- సడెన్ బ్రేక్​తో ప్రాణాలు సేఫ్​

Suicide attempt on railway track: మహారాష్ట్ర ముంబయిలోని శివ్​డీలో ఓ వ్యక్తి రైలు పట్టాలపై పడుకుని ఆత్యహత్యకు ప్రయత్నించాడు. అయితే అతడిని గమనించిన లోకల్​ ట్రైన్​ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. సడెన్​ బ్రేక్​ వేసి ప్రాణాలు నిలిపాడు.

ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని 59ఏళ్ల మధుకర్​ సాబ్లేగా గుర్తించారు. అతడు పట్టాలపై పడుకోవడాన్ని గమనించిన మహిళా కానిస్టేబుల్​ ధనశ్రీ పండిత్​ శెలార్, హోంగార్డు రితుజా మాండే ఏమాత్రం ఆలోచించకుండా కాపాడేందుకు పరుగులు తీశారు. ఈ సమయంలోనే ట్రైన్ డ్రైవర్​ బ్రేక్​ వేయడం వల్ల వారు ఊపిరి పీల్చుకున్నారు. మధకర్​ను పట్టాలపై నుంచి తీసుకొచ్చారు.

ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. వ్యక్తిని కాపాడేందుకు మహిళా కానిస్టేబుళ్లు ప్రయత్నించిన తీరును నెటిజన్లు ప్రశంసించారు. చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్​ను కూడా కొనియాడారు.

ఇదీ చదవండి: జనావాసాల్లోకి బంగాల్​ టైగర్​.. ఆరు రోజులు వారికి చుక్కలు చూపించి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.