student suicide Karnataka: ఆన్లైన్ గేమ్ యానిమేటెడ్ వీడియో చూసి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని దావణెగెరె జిల్లాలో ఏప్రిల్ 23న ఈ ఘటన జరిగింది. ఓ భవనంపై నుంచి దూకి 12వ తరగతి విద్యార్థి తన ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చనిపోయే ముందు ఆ బాలుడు గూగుల్‌లో ఓ ఆన్లైన్ గేమ్‌కు సంబంధించిన యానిమేషన్ వీడియోల గురించి సెర్చ్ చేశాడని నిర్ధరించారు. ఈ వీడియో చూసిన తర్వాతే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.
ఈ ఘటనను పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అతడు తన చెయ్యిని కూడా కోసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భవనం రెండో ఫ్లోర్ నుంచి దూకి చనిపోయాడని చెప్పారు. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్లో.. తన చావుకు తానే కారణమని పేర్కొన్నాడని వివరించారు. అయితే, చేతిరాతను పోల్చి చూసేందుకు నోట్‌ను నిపుణుల వద్దకు పంపినట్లు వెల్లడించారు. చనిపోయిన రోజు అతడికి మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందని చెప్పారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని ఎస్పీ సీబీ రిశ్యంత్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్.. స్కూల్ నుంచి వస్తుండగా..