పాఠాలు చెప్పే గురువుపైనే కాల్పులకు తెగబడ్డాడో విద్యార్థి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లోని మురాద్‌నగర్‌లో జరిగింది. కాల్పులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే.. హోం వర్క్ సరిగా చేయట్లేదని ఉపాధ్యాయుడు మందలించడం వల్ల కక్షకట్టిన విద్యార్థి.. కాల్పులకు ఒడిగట్టినట్టు అనుమానిస్తున్నారు.
మందలించినందుకే..?
తన పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి ఒకరు.. తనపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడని సచిన్ అనే ఉపాధ్యాయుడు పోలీసులను ఆశ్రయించారు. తనకు స్వల్పంగా గాయాలైనట్లు వివరించారు.
ఈ ఘటన వెనకున్న కారణాలు ఇంకా తెలిసిరాలేదు. అయితే.. విద్యార్థి హోంవర్క్ చేయనందుకు అందరి ముందు మందలించిన తరువాత.. అతను కోపంతో టీచర్‌పై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని ప్రకటించారు.
ఇదీ చదవండి: టికాయిత్‌కు బెదిరింపు.. అదుపులోకి నిందితుడు