ETV Bharat / bharat

ఆన్​లైన్ క్లాసులు వింటుంటే.. బండరాయి మీద పడి... - ఆన్​లైన్​ క్లాసులకు పోయి చనిపోయిన విద్యార్థి

ఆన్​లైన్​ క్లాసులకు హాజరయ్యేందుకు కొండమీదకు వెళ్లిన ఓ విద్యార్థి బండరాయి పడి చనిపోయాడు. ఊరిలో సిగ్నల్​ లేమి కారణంగా మిత్రులతో కలిసి పక్కన ఉండే కొండ మీదకు వెళ్లినట్లు మృతుడి సోదరుడు తెలిపాడు.

Student Dies As Boulder Rolls Down Hill During Online Class
ఆన్​లైన్​ క్లాసులకని వెళ్లి.. అనంతలోకాలకు..
author img

By

Published : Aug 19, 2021, 6:09 PM IST

Updated : Aug 19, 2021, 8:50 PM IST

ఒడిశా రాయగడ జిల్లాలోని కందపేంద్రగూడలో దారుణం జరిగింది. ఆన్​లైన్​ క్లాసులకు హాజరయ్యేందుకు కొండ మీదకు వెళ్లిన అండ్రియా జగరంగా అనే బాలుడు మృత్యువాత పడ్డాడు. ఊరిలో మొబైల్​ సిగ్నల్​ లేకపోవడం వల్ల బాలుడు, అతని మిత్రులు కలిసి పక్కన ఉన్న కొండమీదకు వెళ్లారు. ఈ క్రమంలో కొండపై నుంచి జారి పడిన బండరాయి ఆండ్రియా మీద పడింది.

ఈ విషయాన్ని పక్కనున్న పిల్లలు స్థానికులకు అందజేశారు. వారు అత్యవసర సేవా సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది... బండరాయిని తొలగించి బాలుడిని స్థానికంగా ఉండే పద్మాపుర్​ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి బరంపుర్​లోని ఎంకేసీజీ మెడికల్​ కళాశాల, ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోపే బాలుడు చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.

ఇదీ చూడండి: ఏమాత్రం జాలి లేకుండా బాలుడ్ని కట్టేసి కొట్టిన అల్లరిమూక

Last Updated : Aug 19, 2021, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.