ETV Bharat / bharat

'పంట వ్యర్థాల కాల్చివేత ఆగినా తీవ్రంగానే దిల్లీ కాలుష్యం' - ప్రకాశ్​ జావడేకర్​

పంట వ్యర్థాల కాల్చివేత ఆగినప్పటికీ.. దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగానే ఉందని పేర్కొన్నారు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. కాలుష్య కారకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.

Delhi's air pollution
దిల్లీలో వాయు కాలుష్యం
author img

By

Published : Dec 4, 2020, 5:59 PM IST

దేశ రాజధాని చుట్టు పక్కల పంట వ్యర్థాల కాల్చివేత ప్రస్తుతం ఆగిపోయినప్పటికీ.. దిల్లీలో గాలి కాలుష్యం అత్యంత తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. వాయు కాలుష్య కారకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ ప్రభుత్వానికి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

" బయోమాస్, చెత్త కాల్చివేత, అపరిశుభ్రత, నిర్మాణ, నీటి వినియోగ నిబంధనల ఉల్లంఘన, పాడైపోయిన రోడ్లు, వాటి ద్వారా వెలువడే దుమ్ము వంటి కాలుష్య కారకాలపై సీపీసీబీకి పలు ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. పంట వ్యర్థాల కాల్చివేత ఆగినా.. దిల్లీ వాయు నాణ్యత గణాంకాలు క్షీణిస్తున్నాయి. ప్రతిరోజు సీపీసీబీకి చెందిన 50 బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నాయి. కాలుష్యంపై దిల్లీ ప్రభుత్వానికి సీపీసీబీ నోటీసులు జారీ చేసింది. పంట వ్యర్థాల కాల్చివేత ఆగిన క్రమంలో ఇతర అంశాలపై దిల్లీ ప్రభుత్వం, సంబంధిత సంస్థలు దృష్టి సారించాలి. ప్రస్తుతం రాజధాని ప్రాంతం​ ఒక్కటే సమస్యపై పోరాడుతోంది. "

- ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి.

ప్రజల నుంచి అందుతోన్న ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకోవాలని తన నోటీసుల్లో పేర్కొంది సీపీసీబీ. దిల్లీలో కాలుష్యానికి కారణమవుతోన్న నరేలా, ఆనంద్​ విహార్​, ముంద్కా, ద్వారక, పంజాబి బాఘ్​, ఫరీదాబాద్​, ఝజ్జర్​, నోయిడా, భివాడి ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలని సూచించింది.

రోడ్లపై నీటిని చల్లాలి: ఎన్​జీటీ

దిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోన్న క్రమంలో పలు సూచనలు చేసింది జాతీయ హరిత ట్రైబునల్​. ఎన్​సీఆర్​లోని అన్ని మున్సిపల్​ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు.. రోడ్లను ఊడ్చే ముందు నీటిని తప్పనిసరిగా చల్లాలని సూచించింది. అందుకోసం మంచి నీటిని కాకుండా మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి నీటిని తీసుకోవాలని తెలిపింది.

ఇదీ చూడండి: కాలుష్య కోరల్లో దిల్లీ- ప్రపంచంలోనే రెండో స్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.