ETV Bharat / bharat

కేంద్ర మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా?

author img

By

Published : Jul 18, 2021, 7:04 PM IST

కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జిలు సహా పలువురి ఫోన్ల ట్యాపింగ్​కు సంబంధించి రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్​ చర్చనీయాంశమైంది. ఇదే వ్యవహారంపై ప్రముఖ విదేశీ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించేందుకు సిద్ధమయ్యాయని ఆయన వెల్లడించారు.

phones tapping
ఫోన్ల ట్యాపింగ్

కేంద్ర కేబినెట్​ మంత్రులతో పాటు సుప్రీంకోర్టు జడ్జిలు, పాత్రికేయులు, ఆర్​ఎస్​ఎస్​ నేతల ఫోన్ల ట్యాపింగ్​పై రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్​ చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్​కు చెందిన పెగాసుస్‌ స్పైవేర్‌ సంస్థ ట్యాపింగ్​ చేసినట్లు విదేశీ మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తాయన్న వదంతులు వస్తున్నాయని స్వామి పేర్కొన్నారు. అవి నిజమైతే.. ఆ జాబితాను తాను కూడా విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేశారు.

Subramanian Swamy tweet
సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్​

"మోదీ కేబినెట్​ మంత్రులు సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఆర్​ఎస్​ఎస్​ నేతలు, పాత్రికేయుల ఫోన్లను ఇజ్రాయెల్ సంస్థ పెగాసుస్ ట్యాప్​ చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్​, లండన్ గార్డియన్ వార్తా సంస్థలు కథనాన్ని ప్రచురించనునట్లు వదంతులు వస్తున్నాయి. ఇది నిజమైతే.. ఆ జాబితాను విడుదల చేస్తాను."

- రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి

పెగాసుస్ స్పైవేర్​ ద్వారా గుర్తు తెలియని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తల సమాచారాన్ని తస్కరించారని 2019లో ఫేస్​బుక్​కు చెందిన వాట్సాప్ ఆరోపించింది.

ఏమిటీ పెగాసుస్​?

ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఎస్‌ఓ సంస్థ ప్రతినిధులు పెగాసుస్‌ స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా పోలీసు విభాగాలకు మాత్రమే అందిస్తున్నారు. అయితే ఈ స్పైవేర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల ఫోన్లలో ప్రవేశపెట్టారని నిఘా వర్గాలు గుర్తించాయి.

ఇదీ చూడండి: 'ప్రజలకు హెచ్చరిక- మంచినీరు కాచి, తాగండి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.