ETV Bharat / bharat

ఐక్యతా విగ్రహాన్ని సందర్శించిన 50 లక్షల మంది

గుజరాత్​లోని సర్దార్​ పటేల్ ఐక్యతా విగ్రహం మరో ఘనత సాధించింది. ప్రారంభోత్సవం నాటి నుంచి దానిని 50 లక్షల మంది సందర్శించినట్లు అధికారులు తెలిపారు.

Statue of Unity crosses 50 lakh visitors-mark
ఐక్యతా విగ్రహాన్ని సందర్శించిన 50 లక్షల మంది
author img

By

Published : Mar 16, 2021, 5:06 AM IST

గుజరాత్‌లోని కేవడియాలో ఉన్న ఐక్యతా విగ్రహం మరో మైలురాయిని చేరుకుంది. ప్రారంభోత్సవం నాటి నుంచి ఐక్యతా విగ్రహాన్ని 50 లక్షల మందికిపైగా సందర్శించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఐక్యతా విగ్రహం సందర్శకుల సంఖ్య 50 లక్షలు దాటినట్లు గుజరాత్‌ అదనపు ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ గుప్తా ట్వీట్‌ చేశారు.

Statue of Unity crosses 50 lakh visitors-mark
ఐక్యతా విగ్రహాన్ని సందర్శించిన 50 లక్షల మంది

2018 అక్టోబర్‌ 31న కేవడియాలో ప్రారంభమైన ఐక్యతా విగ్రహం అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించేలా ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 8 కొత్త రైళ్లను, అహ్మదాబాద్‌ నుంచి సీప్లేన్‌ను ఇటీవల ప్రారంభించారు.

ఐక్యతా విగ్రహం

ఇదీ చూడండి: దేశంలో 3 కోట్ల మైలురాయి దాటిన టీకా పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.