భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చిన్నతరహా ఉపగ్రహ వాహక నౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) ప్రాజెక్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ రాకెట్‌లోని తొలి దశలో ఉపయోగించే ఘన మోటారుపై నిర్వహించిన 'స్టాటిక్ పరీక్ష' విఫలమైంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఈ పరీక్ష జరిగింది.
ఈ మోటారును 110 సెకన్ల పాటు పరీక్షించాల్సింది. అయితే 60 సెకన్ల ప్రజ్వలన తర్వాత ప్రకంపనలు తలెత్తాయని, 95 సెకన్ల సమయంలో మోటారు నాజిల్ పేలిపోయిందని ఇస్రో వర్గాలు వివరించాయి. ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ఏప్రిల్ లేదా మే నెలలో ప్రయోగించాలని ఇస్రో భావించింది. తాజా ఘటన నేపథ్యంలో ఆ ప్రయోగం వాయిదా పడే అవకాశం ఉంది. ఎస్‌ఎస్‌ఎల్‌వీలో మొదటి దశలో వాడేది కొత్తరకం ఘన మోటారు (ఎస్‌ఎస్1) అని, అది పూర్తిగా కొత్త డిజైన్ అని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇదీ చూడండి: రైల్లో సిగరెట్ తాగితే మూడేళ్ల జైలు.. రూ.1000 జరిమానా!