దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు టీకాలను శరవేగంగా సరఫరా చేస్తోంది కేంద్రం. రానున్న మూడు రోజుల్లో మరో 48 లక్షలకుపైగా డోసులను అందించనున్నట్లు పేర్కొంది.
"రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 75,24,903 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. రానున్న మూడు రోజుల్లో మరో 48,41,670 డోసులు పంపిణీ చేస్తాం"
- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
ఇప్పటివరకు మొత్తం 16,69,97,410 టీకా డోసులు రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిలో మంగళవారం ఉదయానికి వృథాతో సహా 15,94,75,507 డోసులు వినియోగించినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: అడ్రస్ మారిన మృతదేహం- అంత్యక్రియలయ్యాక వెలుగులోకి..