కరోనా మరణాలకు సంబంధించిన నివేదికను బిహార్ రెండు రోజుల అనంతరం సమర్పించిన నేపథ్యంలో.. జిల్లాల వారీ కొవిడ్ కేసులు, మరణాలను(Covid deaths India) రోజూ పర్యవేక్షించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ఈ సమాచారానికి సంబంధించి సమగ్ర రిపోర్టింగ్ విధానం అవసరమని స్పష్టం చేసింది.
బుధవారం బీహార్లో నమోదైన కరోనా మరణాలను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ సవరించగా.. మహమ్మారి మృతుల సంఖ్య 9,429కు చేరింది. దాదాపు 3,951 మరణాలను నివేదించలేదని తేలింది.
కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా మృతుల సంఖ్యను రికార్డు చేసేందుకు.. రాష్ట్రాలు, యూటీలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. వర్చువల్ సమావేశాల్లో గుర్తుచేస్తూనే.. కేంద్ర బృందాలను సైతం ఆయా రాష్ట్రాల్లో మోహరించినట్లు తెలిపింది. జిల్లాల వారీగా కరోనా మృతుల సంఖ్యను వెంటనే నివేదించాలని బీహార్ ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఇవీ చదవండి: బిహార్‌లో లెక్కకు మించిన మరణాలు 72శాతం!