ETV Bharat / bharat

మహారాష్ట్ర, కర్ణాటకలో తగ్గిన కరోనా కేసులు.. కేరళలో భారీగా.. - covid cases in Karnataka

Corona cases in India: భారత్​లో వివిధ రాష్ట్రాల్లో రోజువారి కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. అయితే కేరళలో కొవిడ్​ బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒక్క రోజే 22 వేల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు.

State Wise Corona cases in India
State Wise Corona cases in India
author img

By

Published : Jan 17, 2022, 9:01 PM IST

Corona cases in India: దేశంలో కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. కర్ణాటకలో రోజువారి కొవిడ్ కేసులు దిగొచ్చాయి. కొత్తగా 27,156 కేసులు నమోదవగా.. 14 మంది చనిపోయారు. 7,827 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 2,17,297కు తగ్గింది.

మహారాష్ట్రలోనూ కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 31,111 మందికి వైరస్​ సోకింది. మరో 24 మంది మృతి చెందారు. ఫలితంగా యాక్టివ్​ కేసుల సంఖ్య 2,67,334కు చేరింది. అయితే 122 మందికి ఒమిక్రాన్​ పాజిటివ్​గా తేలింది.​

దేశంలోని ప్రధాన నగరాలు దిల్లీ, ముంబయిలో కొవిడ్​ బాధితులు భారీగా తగ్గారు. దిల్లీలో తాజాగా 12,527 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలగా.. 24 మంది చనిపోయారు. పాజిటివిటీ రేటు 27.99 శాతంగా ఉంది.

ముంబయిలో కొత్తగా 5,956 కేసులు నమోదవగా.. 12 మంది చనిపోయారు. దీంతో నగరంలో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 50,757కు చేరింది.

మరోవైపు కేరళలో కొత్తగా 22,946 మందికి వైరస్​ సోకింది. మరో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. గతవారంతో పోల్చితే.. 182 శాతం కేసులు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.

వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసుల వివరాలు..

ప్రాంతంకొత్త కేసులుమరణాలు
మహారాష్ట్ర31,11124
కర్ణాటక27,15614
దిల్లీ12,52724
కేరళ22,946 72(సవరించిన తర్వాత)
ఉత్తర్​ప్రదేశ్15,62209
బంగాల్​9,38533
ఒడిశా10,48903
రాజస్థాన్​9,23605
మధ్యప్రదేశ్6,970--
ఆంధ్రప్రదేశ్​4,108--
జమ్ముకశ్మీర్​2,82705
తెలంగాణ2,44703
  • బంగాల్​లో కొవిడ్​ ఆంక్షలను సడలించారు. కొన్ని షరతులతో వ్యాయామశాలలు తెరుచుకునేందుకు, జాతరలు నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించారు.

ఇదీ చూడండి: ఫ్రెండ్స్​తో కలిసి భార్యను రేప్​ చేసిన నిందితుడి ఫాంహౌస్​ కూల్చివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.